Monday, December 23, 2024

మళ్లీ భారీ బడ్జెట్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వార్షిక బడ్జెట్ రూపకల్పనలో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందిన తెలంగాణ రాష్ట్ర ఆర్థ్ధికశాఖ వచ్చే 2023 -24వ ఆర్థ్ధిక సంవత్సరానికి కూడా రికార్డుస్థాయి లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోం ది. గత రెండు రోజులుగా జరుగుతున్న బడ్జెట్ కసరత్తుల్లో అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ము ఖ్య కార్యదర్శులు, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు తమ మ విభాగాలకు అవసరమైన నిధులను రెట్టింపుస్థాయిలో కోరినట్లుగా తెలిసింది. అన్ని విభాగాల నుంచి సుమారు రూ.3.25 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని ప్రతిపాదనలను ఆర్థ్ధికశాఖ కు అందజేసినట్లు తెలిసింది. అయితే శాఖల నుం చి వచ్చిన ప్రతిపాదనలను యథావిధిగా ఆమోదిం చే ప్రసక్తేలేదని, భారీగా కోతలు విధించి తుది బ డ్జెట్ రూపకల్పన జరుగుతుందని ఆర్థ్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అంతేగాక అన్ని శాఖల సీనియర్ అధికారులు 2023-24వ ఆర్థ్ధిక సంవత్సరం మొత్తానికి అవసరమైన నిధులను ఇవ్వాలని కోరారని వివరించా రు. అయితే రానున్న శాసనసభ బడ్జెట్ సమావేశా ల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారా? లేక వ చ్చే డిసెంబర్ నెలాఖరు వరకూ అవసరమైన వి ధంగా ఓట్-ఆన్- బడ్జెట్‌ను ప్రవేశపెడతా రా? అనే అంశంపై ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకోవాల్సిన తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వివరించారు. కానీ ఆయా శాఖల అధికారు లు మాత్రం వచ్చే ఆర్థ్ధిక సంవత్సరం మొత్తానికి అ వసరమైన నిధులను అడిగారని తెలిపారు. అందు కే అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనలు సుమా రు రూ.3.25 లక్షల కోట్ల వరకూ ఉన్నాయని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ కాలపరిమితి డిసెంబర్ నెల వరకే ఉన్నందున కొత్త ఆర్థిక సంవత్సరం లో 2023 డిసెంబర్ నెల వరకూ అంటే కేవలం తొమ్మిది నెలల కాలానికి సరిపడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఒకవేళ 2023-24వ ఆర్థ్ధిక సంవత్సరానికి పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే సుమారు 2.80 లక్షల కోట్ల వరకూ ఉండవచ్చునని, అలా కాకుండా కేవలం 9 నెలల కాలానికి ఓట్-ఆన్-ఎక్కౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తే 2.10 లక్షల కోట్ల రూపాయల వరకూ బడ్జెట్ స్వరూపం ఉండవచ్చునని వివరించారు. పైగా ఈ ఏడాదిలో భారీగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని, సుమారు 60వేల మంది వివిధ హోదాల్లో ఉద్యోగాలు భర్తీ అవుతున్నందున రాబోయే కొత్త ఉద్యోగులకు కూడా రానున్న బడ్జెట్‌లోనే నిధులను కేటాయించాల్సి వస్తుందని, అం దుచేత 2023-24వ ఆర్థ్ధిక సంవత్సరంలో నాన్-ప్లాన్ బడ్జెట్ (ప్రణాళికేతర వ్య యం) భారీగా పెరుగుతుందని, అన్ని శాఖల అధికారులు కూడా కొత్త ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొనే బడ్జెట్ ప్రతిపాదనలను ఇచ్చారని వివరించారు. అందుచేతనే ప్రణాళికేతర వ్యయం కింద ఉద్యోగవర్గాల జీతభత్యాలకే కొత్త ఆర్థ్ధిక సంవత్సరంలో ఏకంగా ఒక లక్షా 90 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుండవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

దీనికితోడు తెలంగాణ రాష్ట్రానికి జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన రైతుబంధు, వ్యవసాయరంగంలోని వివిధ పథకాలు, దళితబంధు వంటి సంక్షేమ పథకాలకు ఎలాంటి కొరత లేకుండా నిధులను కేటాయించాల్సి ఉన్నందున బడ్జెట్ రూపకల్పనలో ఎక్కడా రాజీపడకుండా, నిధుల కేటాయింపుల్లో కోతలు విధించకుండా బడ్జెట్ రూపకల్పన చేసేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. అంతేగాక నీటిపారుదల శాఖ, విద్యుత్‌శాఖ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ పరిపాలన, ఆర్ అండ్‌బి శాఖల వం టి ఇంజినీరింగ్ డిపార్టుమెంట్‌లకు రానున్న బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు కూడా ఎక్కువగానే ఉంటాయని అంటున్నారు. గ్రామీణ రోడ్లు, మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని రోడ్లు, వి ద్యుద్దీకరణ కార్యక్రమాలకు పెద్దపీట వేయనున్నందున ఆయా ఇంజినీరింగ్ శాఖలను భారీగానే నిధులను ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఓట్-ఆన్-ఎకౌంట్ బడ్జెట్ అయితే కొత్తగా పథకాలను ప్రకటించే అవకాశం ఉండదని, ఆన్-గోయింగ్ పథకాలకు నిధులు కేటాయింపులు జరుగుతాయని తెలిపారు.

అయితే విద్యుదుత్పత్తి కేంద్రాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్న ప్రభుత్వం యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటుగా గోదావరి నదీ జలాలతో దుమ్ముగూడెం వద్ద జల విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించిన ప్రభు త్వం, ఈ ఏడాది ఆ భారీ ప్రాజెక్టు కూడా చేపట్టే అవకాశాలున్నాయని తెలిపా రు. అందుచేతనే ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చుతో పాటుగా విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని నిధుల కేటాయింపులు జరుగుతాయని వివరించారు. ఇంకా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించాల్సి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాం టి సహకారం లేకపోగా న్యాయంగా రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కూడా కోతలు విధిస్తోందని, అంతేగాక తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిల నిధులను కూడా ఇవ్వకుండా చెయ్యిచ్చినందున ఆయా శాఖల ఉన్నతాధికారులు అడిగినన్ని నిధులు ఇవ్వడం సాధ్యంకాదని అంటున్నారు.

ఎఫ్‌ఆర్ బిఎం చట్టానికి లోబడి న్యాయంగా అప్పులు తెచ్చుకునే అవకాశాలపైన కూడా కేంద్రం ఆం క్షలు విధించిందని, అంతేగాక పన్నుల ఆదాయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిధుల్లో కూడా అంకెల గారడీతో కేంద్రం కోతలు విధించిందని, కేం ద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 34,149 కోట్ల రూపాయల బకాయిలను కూడా ఇవ్వకుండా మొండిచెయ్యి చూపించిందని, ఇవే పరిస్థితులు వచ్చే ఆర్ధిక సంవత్సరంలోనూ కొనసాగే ప్రమాదం ఉందని, కేంద్రం తెలంగాణ ప్రజలపై ఎలాంటి కనికరం చూపించకుండా ఆర్థ్ధికంగా దెబ్బకొడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎదుర్కొన్న ఇబ్బందులనే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా కేంద్రం మిగతా రాష్ట్రాలకు సహకరించినట్లుగా తెలంగాణ రాష్ట్రానికి కూడా సహకరిస్తే మరో 45 వేల కోట్ల రూపాయలను జతచేసి కేటాయింపులు చేసే అవకాశం ఉండేదని, ఆ మేరకు కేంద్రం గండికొట్టిందని ఆర్థికశాఖ వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇకనైనా కేంద్రం తీరు మారుతుందో… లే దో..వేచిచూడాలి..అని ఆ అధికారులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News