Saturday, November 9, 2024

దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన

- Advertisement -
- Advertisement -

చొప్పదండి: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 9 సంవత్సరాలలో అభివృద్ధి చేయని పని చేస్తున్నారని ప్రపంచంలో రైతు చనిపోతే ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల రైతు భీమా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు.

చొప్పదండి పట్టణానికి 100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని ఆగస్టు 15 వరకు సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ గుర్రం నీరజ భూమారెడ్డి, జిల్లా కౌన్సిలర్ ఫోరం చైర్మన్ ఆరో వార్డు కౌన్సిలర్ వడ్లూరి గంగరాజుని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌వో అంబటి రజిత, ఆర్‌ఐ అరుణ్‌కుమార్, సింగిల్ విండో అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి, కౌన్సిలర్లు కొట్టే అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాడూరి శ్రీనివాస్, దండ జమున కృష్ణ, చేపూరి హేమ సత్యం, పెరమండ్ల మానస గంగయ్య, కొత్తూరు భారతి నరేష్, మహేష్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News