మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రాన్ని ఆర్థ్ధికంగా దెబ్బతీయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు ఎక్కడికక్కడనే అనేక అడ్డంకులు సృష్టిస్తూ వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి రాకుండా చేసిన కేంద్ర ప్రభుత్వం తనకు ఇష్టంలేకపోయినా తెలంగాణ రాష్ట్ర ఘనతను నిండు లోక్‌సభకు లిఖిత పూర్వకంగా నివేదించిన అపూర్వ ఘట్టం చోటుచేసుకొంది. రాష్ట్ర తలసరి నికర స్థూల ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించిందని, తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం లో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ లోక్‌సభకు నివే దించింది. లోక్‌సభలో 4666వ ప్రశ్నకు సమా ధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల తలసరి స్థూల ఆదాయం 3,08,732 రూపాయలు ఉందని ఆర్థ్ధిక తన జవాబులో పేర్కొంది. తెలంగా ణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో, తలసరి ఆదా య సముపార్జనకు, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవ్వడాని కి, ప్రజల ఆదాయం ఇలా పెరగ డానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకా లు సాధించిన ఘన విజయ మని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింద ని ఆర్థ్ధిక శాఖలోని కొందరు సీని యర్ అధికారులు సగర్వంగా వివరించారు. వా స్తవానికి ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర స్థూల తలసరి ఆదాయం 3,17,115 రూపాయలు ఉందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏ ర్పడే నాటికి అంటే 2014లో రాష్ట్ర స్థూల తలసరి ఆదాయంలో కేవలం పదో స్థానంలో ఉన్నామని, కానీ ఇప్పుడు బి ఆర్‌ఎస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుం చి రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నిబద్దత కలిగిన పాలనతో అన్ని వర్గాల ప్రజలను ఎకనమిక్ యాక్టివిటీలో భాగస్వాముల ను చేయడంతోనే తలసరి ఆదాయం రికార్డు స్థా యిలో పెరిగిందని ఆ అధికారులు సగర్వంగా వివరించారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ పాలనకు చిహ్నంగా నిలిచే విధంగా జాతీయ తలసరి ఆదాయం కేవలం 1,70,620 రూపాయలు మాత్రమే ఉందని, కేంద్రం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 1,46,495 రూపాయలు అధికమని ఆ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజల్లో ఒక్కొక్కరు ఏడాదికి సగటున 3,08,732 రూపాయలను సంపాదిస్తున్నారని, ఇది దేశంలోనే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే తెలంగాణ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని ఆర్ధిక మంత్రిత్వశాఖ లోక్‌సభకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది.
రెండో స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉందని, కర్ణాటలో తలసరి ఆదాయం 3,01,673 రూపాయలు ఉందని ఆ నివేదిక తెలిపింది. మూడో స్థానంలో హర్యానా రాష్ట్రం 2,96,685 రూపాయలు ఉంది. నాలుగో స్థానంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం 2,73,288 రూపాయలు కాగా, 5వ స్థానంలోని మహారాష్ట్రలో ఒక్కొక్కరి ఆదాయం 2,42,247 రూపాయలు కాగా 6వ స్థానంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం తలసరి ఆదాయం 2,33,565 రూపాయలు ఉంది. 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తలసరి ఆదాయం 2,19,518 రూపాయలు ఉందని ఆ నివేదిక తెలిపింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ రెండు లక్షల రూపాయల లోపునే ఉన్నాయని, తలసరి ఆదాయం అత్యంత తక్కువగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల తలసరి ఆదాయ వివరాలను కేంద్రం దాచిపెట్టిందని ఆర్ధిక శాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.
ఎందుకంటే తలసరి ఆదాయ వివరాలను బయటపెడితే డబుల్ ఇంజన్ (కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపి ప్రభుత్వాలుండటం) రాష్ట్రాల్లోని పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాల బండారం బట్టబయలవుతుందనే ఉద్దేశ్యంతోనే ఆయా రాష్ట్రాల తలసరి ఆదాయం లెక్కలను లోక్‌సభకు నివేదించలేదని అభిప్రాయపడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని తలసరి ఆదాయం అత్యంత దారుణంగా, దయనీయంగా ఉందని, ఆయా రాష్ట్రాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయాయని, అందుకే ఈ రెండు రాష్ట్రాలతో పాటుగా ఏకంగా 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తలసరి ఆదాయ లెక్కలను లోక్‌సభకు నివేదించకుండా గణాంకాలను దాచిపెట్టారని ఆ అధికారులు వివరించారు.
తెలంగాణ పథకాలే దేశానికి రక్ష
రాజకీయపరమైన కారణాలతో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలను నష్టం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం అయిష్టంగానే తెలంగాణ రాష్ట్ర ప్రగతిని లోక్‌సభకు తెలిపిందని, అందుకే పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు తమకూ కావాలని కోరుతున్నారని, అలా సాధ్యంకాకపోతే తమతమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలనే డిమాండ్లు ఊపందుకొన్నాయని స్వయంగా మహారాష్ట్ర నేతలే వివరించారని ఆ అధికారులు గుర్తుచేశారు. వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం, పారిశ్రామిక రంగానికి, ఐటి, ఫార్మా రంగాలకు కూడా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం, రైతుబంధుతో వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించడం, పుష్కలంగా సాగునీటిని సరఫరా చేయడం, దళితబంధు, ఆసరా పెన్షన్లు, ఇతరత్రా పెన్షన్ పథకాలు, కులవృత్తులకు ఆర్ధిక సాయం చేస్తూ రాజధాని నగరమైన హైదరాబాద్ నుంచి మారుమూల పల్లెల్లో నివశించే సామాన్య ప్రజలకు కూడా ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్ధిక కార్యకలాపాలు)లో భాగస్వాములను చేస్తూ ప్రజల ఆదాయాన్ని పెంచుతూ, సుపరిపాలనను అందిస్తూ, ఆర్ధిక క్రమశిక్షణను సాటిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందుకే ఇంతటి ఘనతను సాధించగలిగామని ఆ అధికారులు సగర్వంగా వివరించారు.
మహారాష్ట్రలోని షేత్కారీ రైతు సంఘటన్‌తో పాటుగా జాతీయ రైతు సంఘాలకు చెందిన 52 మంది జాతీయ నాయకులు సంతకాలతో కూడిన లేఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రాసిన లేఖలో తమ ఆనందాన్ని వ్యక్తంచేశారని ఆ అధికారులు వివరించారు. రైతాంగానికి జనరల్ మార్షల్‌గా కెసిఆర్ అవతరించారని ఆ రైతు సంఘాల నాయకులు కొనియాడారని తెలిపారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్లు రోజురోజుకూ ఊపందుకొంటున్నాయని తెలిపారు. ఈ చేదు నిజాన్ని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల పనితీరును స్వయంగా పరిశీలించడానికి వచ్చిన మహారాష్ట్రలోని రైతు నేతలు, సీనియర్ పాత్రికేయుల బృందం కదలికలపైన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) కూడా నివేదించిందని, కేంద్రానికి కూడా తెలంగాణలోని రైతు సంక్షేమ పథకాలపై చాలా స్పష్టత ఉందని కూడా ఆ అధికారులు వివరించారు. అందుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇకనైనా పట్టుదలలకు పోకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ పార్టీ మనుగడలో ఉందనే విషయాన్ని గమనంలో ఉంచుకొని రాష్ట్ర ప్రజలకు సహకరిస్తూ ఇవ్వాల్సిన నిధులు, బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఆ అధికారులు కోరుతున్నారు.