Thursday, January 23, 2025

విద్యుత్ కాంతుల్లో తెలంగాణ రాష్ట్రం

- Advertisement -
- Advertisement -
  • సంస్కరణలతో దూసుకెళ్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వం
  • పల్లె పల్లెనా వెలుగులు నింపడమే లక్ష్యం
  • విద్యుత్ విజయోత్సవ సభలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఆదిభట్ల: బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కాంతులతో వెలిగిపోతొందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఇబ్ర హీంపట్నం మండలం బొంగళూర్ సమీపంలోని కళ్లెం జంగారెడ్డి గార్డె న్స్‌లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యుత్ సరఫరాలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. వ్యవసాయంతో పాటు పారిశ్రా మిక రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అంది ంచడం గర్వ కారణమని అన్నారు. అసాధ్యాన్నీ సైతం సు సాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఆయన కొనియాడారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాష్ట్రం అంధ కారంలో మగ్గిందని ఆయన అన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వ దూరదృష్ఠ్ తో మారు మూల పల్లెలు సైతం విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్నాయని అన్నారు.

గతంలో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కేవలం 11 సబ్ స్టేషన్లు మా త్రమే అందుబాటులో ఉండేవని అన్నారు. దీంతో రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొ నే వారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన అనతికాలంలోనే 33 సబ్ స్టేషన్ లతో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపెట్టా మని ఆయన తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యో గ సిబ్బందికి తెలంగాణ దశాబ్ది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమ ంలో జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతి రావు, గ్రంధాలయ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, రైతు సమ న్వయ సమితి కన్వీనర్ వంగేటి లక్ష్మరెడ్డి, విద్యుత్ శాఖ డీఈ యాదగిరి, ఏఈ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News