Monday, January 20, 2025

జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యస్.పి కె. అపూర్వ రావు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతకాన్ని అవిష్కరించిన అనంతరం జాతీయ గీతాలాపన ఆలపించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి, అడిషనల్ ఎస్పీ కె ఆర్ కె ప్రసాద రావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ హన్మంతరావు, నల్లగొండ డిఎస్పీ నరసింహ రెడ్డి,డిసి ఆర్ బి డిఎస్పీ రమేష్,సీఐలు పి.యన్.డి ప్రసాద్,గోపి,ఆది రెడ్డి,శ్రీను,ఆర్. ఐ లు నరసింహ చారి, స్పర్జన్ రాజ్,హరిబాబు, సంతోష్,శ్రీను,నరసింహ,కృష్ణ రావు,యస్.ఐ లు,మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News