Wednesday, January 22, 2025

పరిగిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

- Advertisement -
- Advertisement -

పరిగి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పరిగి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయంపై ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి జాతీయ జెండాను ఎగర వేశారు. పట్టణంలోని మున్సిపాలిటీతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. పరిగి మున్సిపల్ కార్యాలయంపై చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ జెండాను ఎగరవేశారు.

పరిగి ఎంపిడిఓ కార్యాలయంపై ఎంపిపి కరణం అరవింద్‌రావు, మార్కెట్ కమిటీ కార్యాలయంలోపై చైర్మన్ సురేందర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా అన్యాయానికి గురైందని తెలుసుకున్న కేసిఆర్ ఉద్యమాలు, పోరాటాలు, దీక్షలు చేపట్టి ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నామని అన్నారు. రాష్ట్రం అవతరించి నేటితో 9వ సంవత్సరంలోకి అడుగు పెట్టామని తెలిపారు. బంగారు తెలంగాణ సాధన దిశగా రా్రష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణలో పేదల కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలను తీసుకవచ్చి వారిని అన్ని రంగాలలో ముందుకు తీసుకవెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌దేనని అన్నారు.

ముఖ్యంగా రైతులకు, దళితులకు, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. మహిళలకు, యువతను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలను, పట్టణాలను సుందరీకరణ చేస్తున్నారని చెప్పారు. నూతన మున్సిపాల్టీల ఏర్పాటు, చిన్న గ్రామాలను పంచాయతీలుగా తీర్చిదిద్దామన్నారు. కులవృత్తులను ప్రోత్సహించారని, సబ్బండ కులాలను ఆదరించారని చెప్పారు. రెండు పర్యాయాలుగా రాష్ట్రానికి సిఎంగా ఉండి కేసిఆర్ సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు.

పట్ణణంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాలపై, మండలంలోని గ్రామ పంచాయతీలలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి హారిప్రియారెడ్డి, ఎంపిపి అరవింద్‌రావు, వైస్ ఎంపిపి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ కల్లు లక్ష్మీశ్రీనివాస్‌రెడ్డి, పిఏసిఎస్ ఛైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ శివనోళ్ల భాస్కర్, తహసీల్దార్ రాంబాబు, డిప్యూటీ తహసీల్దార్ నర్సింహ్మారెడ్డి, ఎంపిడిఓ శేషగిరి శర్మ, ఎంపిఓ దయానంద్, ఎంఈఓ హారిశ్చందర్, కౌన్సిలర్‌లు వేముల కిరణ్‌కుమార్, వారాల రవీందర్, ఎదిరే కృష్ణ, వెంకటేష్, నాగేశ్వర్, మున్నీర్, పార్వతమ్మ, రియాజ్, మల్లేశం, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కావలిలక్ష్మీ, నాయకులు మౌలానా, బషీర్, అన్వర్, బలాల, రవి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News