Saturday, December 21, 2024

మహిళా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: మహిళా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని పరిగి ఎమ్మె ల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా నియో జకవర్గ స్థాయిలో పరిగి పట్టణంలోని ఎస్ గార్డెన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవా రం మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల శ్రేయస్సుకు అమలు చేస్తున్న పథకాలను అర్హులైనా ప్రతి ఒక్కరూ పూరిత స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నా రు.

ఇతర రాష్ట్రాలు మన తెలంగాణ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకుని అక్కడ అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కేసిఆర్ కిట్టు ద్వారా లక్షల మందికి లబ్ది చేకూరిందన్నారు. గర్భిణీ స్త్రీల కు కేసిఆర్ న్యూట్రీషన్ కిట్టును అమలు చేస్తున్నారని తెలిపారు. అమ్మఒడి, గర్భి ణీ స్త్రీలకు తల్లులకు పోషకాలతో కూడిన భోజనం అందించేందుకు ఆరోగ్య లక్ష్మీపథకం, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు పారితోషకాలను పెంచిన ఘనత ముఖ్యమంత్రి దే అన్నారు. ఈ ఉత్సవాలకు నియోజ కవర్గంలోని ఆయా మండలాలల నుంచి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.

పథకాల ద్వారా మంజూరైనా అర్హులకు వివిధ యూనిట్లను అందించారు. డ్వాక్రా సం ఘాల మహిళలకు మంజూరైనా చెక్కులను మండలాల వారిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ముకుంద అశోక్, డిపిఓ తరుణ్‌కుమార్, మై నార్టీ సంక్షేమ శాఖ అధికారిణి సుధారాణి, మండల ప్రత్యేకాధికారి దీపారెడ్డి, ఎంపిపి కరణం అరవింద్‌రావు, జడ్‌పిటిసి హారిప్రియారెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ సురే ందర్, సోసైటీ ఛైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ భాస్కర్, మున్సిపల్ కమీష నర్ శ్రీనివాసన్, ఆయా మండలాల ఎంపిపిలు మల్లేశం, అనుసూజ, సత్య మ్మ, జడ్‌పిటిసిలు నాగిరెడ్డి, మేఘమాల, నవ్యారెడ్డి, ఎంపిడిఓలు శేషగిరిశర్మ, ఉమా దేవి, జయరాం, సేర్ఫ్ ఏపిఓలు కే.శ్రీనివాస్‌రెడ్డి, కే.శోభ, బందెయ్య కౌన్సిలర్‌లు ఆయా శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News