Wednesday, January 22, 2025

మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

గోషామహల్: మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) డా క్టర్ గడల శ్రీనివాస్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎం పవర్ మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాకుమాను శశిశ్రీ ఆధ్వర్యంలో కోఠిలోని డిఎంహెచ్‌ఎస్ క్యాంపస్‌లో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్ర భుత్వం మహిళల ఆరోగ పరిరక్షణకు విశేషమైన కృషి చేస్తుందన్నారు. గర్బిణీ స్త్రీలకు పోషల విలువలతో కూడిన పౌష్టికాహారం(న్యూట్రి షియన్ కిట్ ) శి శువుల తల్లులకు కెసిఆర్ కిట్లను అందించి ఆడపడుచులకు అండగా నిలుస్తుందన్నారు.

మహిళా ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం తె లంగాణ మెడికల్ అ ండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, ఉచితంగా వివిధ వైద్య పరీక్ష లు నిర్వహించి, మందు లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. మహిళలు వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమ స్యలున్నా ప్రాథమిక దశలో నే వాటిని గుర్తించి, నివారించే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఉమెన్ ఎంపవర్ మెంట్ అసోసియేషన్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని డాక్టర్ గడల శ్రీనివాస్‌రావు ఆకాంక్షించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాకుమాను శశిశ్రీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఉమెన్ ఎంపవర్‌మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యం లో మహిళా ఉద్యోగులకు ఆరోగ్య భ ద్రతను దృష్టిలో ఉంచుకుని మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

వైద్య శాఖలో విధులు నిర్వహిస్తు న్న మహిళా ఉద్యోగుల సంక్షేమం, ఆ రోగ్య భద్రతను బాధ్యతగా భావించి పలు ఆసుపత్రుల సహకారంతో మహిళా ఉద్యోగులకు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందు లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి విజయనిర్మల, కోశా ధికారి స్పూర్తి, ఉపాధ్యక్షులు వై అనితా రెడ్డి, నిర్మల, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు భీమ్‌రెడ్డి, డాక్టర్ నీంద్రా ఆర్ముగం, డాక్టర్ అర్జున్ రాజ్, డాక్టర్ గీత, షీలారాణి, రమాదేవి, కల్పన, మంజులా రెడ్డి, డాక్టర్ లలితా రెడ్డి, సిహెచ్ లలితా రాణి, విజయలక్ష్మి, లావణ్య, నర్సుబాయి, ఓమెగా, కేర్, జాయ్ ఆ సుపత్రుల వైద్యబృందం, వాస్విక్ ఫౌండేషన్, డెం టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రెడ్ క్రాస్ సొసైటీ ఆఫ్ ఇండియా నగర శాఖల ప్రతినిధులు పా ల్గొని సేవలందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News