Monday, December 23, 2024

మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -
  • కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: మహిళా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవం మేడ్చల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని అన్నారు.

అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. మనసున్న ముఖ్యమంత్రి కేసీఅర్ అని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేస్తూ ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించే భరోసా కల్పిస్తూ పది లక్షలకు పైగా ఆడబిడ్డల పెండ్లిళ్లు చేసిన మేనమామ సీఎం కేసిఆర్ అని అన్నారు. గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిన గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి సీఎం కేసిఆర్ అని కొనియాడారు.

అంగన్‌వాడీలను, ఆశా కార్యకర్తలను దేశంలోనే అత్యధిక పారితోషికాలతో గౌరవప్రదంగా జీవించే గొప్ప అవకాశం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వందని అన్నారు. ఆడబిడ్డల సంక్షేమంలో మనకు ఎదురులేదని అన్నారు. మహిళా సాధికారతలో తెలంగాణది దేశంలో మొదటి స్థానం అని అన్నారు. అమ్మఒడి వాహనమైన, ఆరోగ్యలక్ష్మి పథకమైన, భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా, ఒంటరి మహిళలకు తండ్రిలా, ఆడబిడ్డలకు మేనమామలా, అవ్వలకు పెద్దకొడుకులా కొండంత అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు నందా రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి, ఎంపిపిలు రజిత రాజా మల్లారెడ్డి, ఎల్లుబాయ్, హారిక మురళి గౌడ్, మేడ్చల్ జడ్పిటిసి శైలజ విజయానంద్ రెడ్డి, ఎంపిటిసిలు, సర్పంచ్ లు, నాయకులు, అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News