Sunday, December 22, 2024

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంది

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో జరిగిన రైతుల సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రైతన్నలు చాలా సంతోష ంగా ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన దక్షతతో వ్యవసాయ రంగం గొప్పగా అభివృద్ధి చెందిందన్నారు. రైతులకు ఉచితంగా 24గంటలు కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.

24గంటల క రెంటు ఇవ్వడం, వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా రైతు బంధు అందించడం, కృష్ణా, గోదావరి బేసిన్ నుండి సాగునీటిని అందించడం కారణంగా సంవత్సరానికి రైతులు మూడు పంటలు పండిస్తున్నారని అన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మూడు పంటలకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చే బిఆర్‌ఎస్ పార్టీ కావాలో, కేవలం మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలో ఆలోచన చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని, కరెంటు కోసం బావుల దగ్ర పడిగాపులు కాసే పరిస్థితి వస్తుందని అన్నారు.

అన్ని రంగాల పైన, తెలంగాణ రాష్ట్రం పైన సమగ్రమైన అవగాహణ కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రమే అని, ఆయన నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షు లు సుంకర అజయ్‌కుమార్, కాసాని వెంకటేశ్వ ర్లు, దొడ్డ సురేష్ బాబు, అన ంత సైదయ్య, ఏలూరి వెంకటేశ్వరరావు, వెనపల్లి వెంకటయ్య, ఈదుల కృష్ణ య్య, సొసైటీ ఛైర్మన్లు కొండా సైదులు, ఆవుల రామారావు, నలజాల శ్రీనివాసరావు, ముత్తవరపు రమేష్, బాష్యం సైదులు, అలసగాని జనార్ధన్, రామ్ రెడ్డి, కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు,పుట్టా రమేష్, గొలుసుల రాజేష్, ముప్పాని శ్రీధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు, పాల సంఘం అధ్యక్షులు కస్తూరి నర్సయ్య, సొసైటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి కోఆర్టినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News