Saturday, December 21, 2024

పల్లె ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజ

- Advertisement -
- Advertisement -
  • కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

శామీర్‌పేట: పల్లె ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అది సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం శామీర్‌పేట మండలంలో మజీదపూర్, అలియాబాద్ గ్రామాల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌దే అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో పల్లెలన్నీ కరువు, కాటకాలతో తల్లడిల్లారని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన పంచాయతీరాజ్ చట్టం తీసుకవచ్చి గ్రామాల్లో అవసరమైన వనరులను అందజేశారని తెలిపారు.

రాష్ట్రంలో రైతులకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అనేక పథకాలు ప్రతి గడప గడపకు తీసుకువచ్చారని చెప్పారు. అనంతరం కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో గడిపారు. అలియాబాద్‌లో చెత్తను తరలించడానికి ఆటోలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపిపి ఎల్లుబాయిబాబు, డిసిఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, సర్పంచ్లు గుర్కకుమార్, సరసం మోహన్‌రెడ్డి, జడ్పిటిసి అనితలలయ్య, వైస్ ఎంపిపి సుజాత, ఆర్డీవో రవి, డిఆర్‌డిఓ పిడి పద్మజరాణి, డిఎల్ పిఓ స్మిత, డిపిఓ రమణమూర్తి, ఎంపిడిఓ వాణి, ఎంపిఓ మంగతాయారు, రైతుబంధు సమితి అధ్యక్షుడు కమఠం కృష్ణారెడ్డి, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, వివిధ గ్రామాల కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News