రుద్రూర్ : ప్రపంచంలోనే అత్యధికంగా లబ్దిదారులకు పెన్షన్లను ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను కులాలను సమానంగా గౌరవిస్తూ నిధులు మంజూరు చేశామన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవనము, కస్తూరిబా, బాలికల పాఠశాల, వివిధ సంఘాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. ఆయనతో పాటు తన కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో పేదలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకోవడానికి 100 జనరల్ ఫంక్షన్ హాల్స్ నిర్మించామని, కులమతాలకు, రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఎవరైనా ఈ ఫంక్షన్ హాల్‌లలో శుభకార్యాలు జరుపుకోవచ్చునని ఆయన తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి తల్లిదండ్రులు అప్పుల పాలవ్వకుండా మేనమామలాగా కెసిఆర్ కల్యాణలక్ష్మి,షాధిముబారక్ పథకం అమలు చేసి లక్షా నూట పదహారు రూపాయలు ఇస్తున్నారు.
పేదింటి ఆడబిడ్డ పెళ్లికి నగదు సహాయం అందించే ఏకైక తెలంగాణ రాష్ట్రం బాన్సువాడ నియోజక వర్గంలో 14వేల మందికి రూ. 120 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రం మొత్తంలో పదివేల మందికి ఇస్తున్నామని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలో 11 ఇండ్లు నిర్మించుకున్న ఏకైక బాన్సువాడ నియోజక వర్గమని అన్నారు. గృహలక్ష్మి కింద మూడు లక్షల రూపాయల స్కీంని అమలు చేస్తున్నామన్నారు. లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన మండలాల్లో మొట్టమొదటి రుద్రూర్ మండలం అని బాన్సువాడ నియోజక వర్గంలో మొట్టమొదటి రుద్రూర్ మండలాన్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభించామన్నారు.
మండలంలో 376 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టుకున్నామన్నారు. కస్తూర్బా పాఠశాల భవనానికి నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించుకున్నామన్నారు. తెలంగాణ రాకముందు అందిస్తే 26 లక్షల మందికి పెన్షన్లు అందిస్తే తెలంగాణ ఏర్పాటును తర్వాత లక్షల పెన్షన్లను అందించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఏ రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు ఇచ్చి ఘనత లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు గీత కార్మికులకు వివిధ రకాల పెన్షన్లు అందించామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 200 పెన్షన్ ఇస్తే తెలంగాణ వచ్చిన తర్వాత 2016 రూపాయలు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రంలోని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో వెయ్యి రూపాయల పెన్షన్స్ ఉంటే ఎందుకు తెలంగాణలో 2016 రూపాయల పెన్షన్స్ ఇస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో నెలకు 1000 కోట్ల రూపాయల పెన్షన్స్ రూపంగా సంవత్సరానికి 1200 కోట్లు ఇస్తున్నామన్నారు. రైతు బీమా ద్వారా అనారోగ్యంతో మృతి చెందిన రైతు వివిధ కారణాలతో మృతి చెందిన రైతులకు ఐదు లక్షల రూపాయల భీమా సౌకర్యం కల్పించామన్నారు. రైతులకు నీటి కొరత, విద్యుత్ కొరత లేకుండా 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రుద్రూర్ నుండి బొప్పాపూర్ వరకు 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు మంజూరు చేసుకున్నామని అన్నారు.
బాన్సువాడ నియోజక వర్గంలోని ఏ యొక్క నిరుపేదకు ఇల్లు లేకుండా ఉండకుండా డబుల్ బెడ్ రూంలు నిర్మించుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం నాలుగు కోట్ల టన్నుల ధాన్యం పండిస్తున్నారు. ఆ ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతులకు 2060 రూపాయల మద్దతు ధర ప్రకటించామన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయల రుణమాఫీ చేశామన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆర్డీవో రాజాగౌడ్, పిడి చందర్ నాయక్, హౌసింగ్ డిఈ నాగేశ్వరరావు, ఎంపిపి అక్కపల్లి సుజాత నాగేందర్, ఎంపిపి నట్కెర్ సాయిలు, జెడ్పిటిసి నారోజి గంగారాం, ఎంపిటిసిలు, సర్పంచులు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.