Friday, December 20, 2024

నవంబర్ 30న తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

21 నుంచి వచ్చే నెల 4 వరకు నామినేషన్లు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (స్టేట్ మెడికల్ కౌన్సిల్)కి ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది. 25 మంది డాక్టర్లతో ఏర్పాటు కాబోతున్న తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో 12 మందిని ప్రభుత్వం నామినేట్ చేయనుండగా, మరో 13 మంది సభ్యుల ఎంపిక కోసం నవంబర్ 30వ తేదీన ఓటింగ్ నిర్వహించనున్నారు. ఇందు కోసం ఈ నెల 18వ తేదీ నుంచి సెప్టెంబర్ 2 వరకు నామినేషన్ పత్రాలు జారీ చేయనున్నారు. ఈ నెల 21 నుంచి వచ్చే నెల 4 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. బ్యాలెట్ పేపర్ల పంపిణీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 15 తేదీ వరకు కొనసాగనుంది. నవంబర్ 30వ తేదీన బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 1వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News