Wednesday, January 22, 2025

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఎలా?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజులు గా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సిఎం రేవంత్, పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేశారు. ఇక రెండో రోజు శుక్రవారం యుపిఎస్‌సి చైర్మన్, కార్యదర్శిలతో సుదీర్ఘంగా భేటీ అయి టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన అంశంపై సిఎం చర్చించారు. అనంత రం హైదరాబాద్‌లో రక్షణ శాఖ భూముల బదలాయింపుపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం శుక్రవారం రాత్రి న్యూ ఢిల్లీ నుంచి రేవం త్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (యుపిఎస్‌సి) సు మారు వందేళ్ల చరిత్ర ఉంది. సుదీర్ఘ చరిత్రతో పాటు నిర్ధిష్ట కాలపరిమితిలోనే నోటిఫికేషన్, పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణ, ని యామక ప్రక్రియను చేపడుతోంది. తెలంగాణలోని రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టి ఎస్‌పిఎస్‌సి)ను ఆవి ధంగానే రూపొందించాలని తాము నిర్ణయించుకున్నామని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి యుపిఎస్‌సి చై ర్మన్ డాక్టర్ మనోజ్ సోనితో తెలిపా రు. న్యూ ఢిల్లీలోని యుపిఎస్‌సి కార్యాలయం లో యుపిఎస్‌సి చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని, కార్యదర్శి శశిరంజన్ కుమార్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళన, యుపిఎస్‌సి పని తీరుపై సు మారు గంటన్నర పాటు చర్చించారు. యుపి ఎస్‌సి పారదర్శకత పాటిస్తోందని, అవినీతి మర క అంటలేదని, ఇంత సుదీర్ఘకాలంగా అంత సమర్థంగా యు పిఎస్‌సి పని చేస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. తెలంగాణలో నియామ క ప్రక్రియలో నూతన విధానాలు, పద్ధతులు పాటించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యుపిఎస్‌సి చైర్మన్, సభ్యుల నియామకంలో రాజకీయ ప్రమేయం ఉండదని, సమర్థత ఆధారంగా ఎంపిక ఉంటుందని రేవంత్ తెలిపారు. తాము 2024 డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాల ని భావిస్తున్నామని, ఇందుకు టిఎస్పీఎస్సీని ప్ర క్షాళన చేయాలనుకుంటు న్నామని ముఖ్యమం త్రి రేవంత్ యూపిఎస్సీ చైర్మన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం టిఎస్పీఎస్సీ చైర్మ న్, సభ్యుల నియామకాన్ని రాజకీయం చేసి, దానిని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిందని రేవంత్ తెలిపారు. ఫలితంగా పేపర్ లీకులు, నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఓ ప్రహసనంగా మారిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని, కానీ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్ధతతో నియామకాల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చోటు చేసుకుందన్నారు. తామ రాజకీయ ప్రమేయం లేకుండా చైర్మన్, సభ్యుల నియామకం చేపడతామని ముఖ్యమంత్రి తెలిపారు. టిఎస్పీఎస్సీలో అవకతవలకు తావులేకుండా సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమిస్తామని రేవంత్ వివరించారు.
చైర్మన్‌కు, సభ్యులకు శిక్షణ ఇస్తాం: యూపిఎస్‌సి చైర్మన్
సిఎం రేవంత్ చెప్పిన విషయాలకు స్పందించిన యూపిఎస్‌సి చైర్మన్ డాక్టర్ మనోజ్ సోని టిఎస్‌పిఎస్‌సిని యూపిఎస్‌సి తరహాలోనే తీర్చిదిద్దేలా చైర్మన్‌కు, సభ్యులకు శిక్షణ ఇస్తామని, సచివాలయ సిబ్బందికి అవగాహన తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి వి.శేషాద్రి, ఓఎస్డీ అజిత్ రెడ్డి, టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ పాల్గొన్నారు.
రక్షణశాఖ భూములను బదలాయించండి: కేంద్ర మంత్రికి విజ్ఞప్తి
రక్షణ శాఖ భూములు బదలాయించాలని నగరంలోని రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములు కేటాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం సాయంత్రం కలిశారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు మెహిదీపట్నం రైతు బజార్ వద్ద స్కైవాక్ నిర్మిస్తున్నామని, ఇందుకోసం అక్కడ ఉన్న రక్షణ శాఖ భూమి 0.21 హెక్టార్లను బదిలీ చేయాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆ భాగంలో మినహా స్కైవే నిర్మాణం పూర్తి కావస్తున్నందున ఆ భూమిని వెంటనే బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కోరారు. అందుకు రక్షణ శాఖ మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ టు -రామగుండం ను కలిపే రాజీవ్ రహదారిలో ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగు రోడ్డు జంక్షన్ వరకు ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం, ఎంట్రీ, ఎగ్జిట్ ర్యాంపుల నిర్మాణానికి మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి 83 ఎకరాల రక్షణ శాఖ భూమి అవసరమని దానిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి సిఎం రేవంత్ విజ్ఙప్తి చేశారు. నాగ్‌పూర్ హైవే (ఎన్‌హెచ్44)పై కండ్లకోయ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ మొత్తంగా 18.30 కిలోమీటర్ల మేర ప్రతిపాదించామని, అందులో 12.68 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి, నాలుగు ప్రాంతాల్లో ఎగ్జిట్, ఎంట్రీలకు, భవిష్యత్‌లో డబుల్ డెక్కర్ (మెట్రో కోసం) కారిడార్, ఇతర నిర్మాణాలకు మొత్తంగా 56 ఎకరాల రక్షణ శాఖ భూములు బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఙప్తి చేశారు. ముఖ్యమంత్రి విజ్ఙప్తులకు రక్షణ శాఖ మంత్రి సానుకూల స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News