Saturday, November 9, 2024

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదగాలి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : గ్రామ దేవతల చల్లని చూపుతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా ఆదివారం గౌలిగూడలోని మహంకాళి అమ్మవారిని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామ దేవతలుగా పూజించే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ తల్లులు తమ చల్లని చూపులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రతీ ఇళ్లు శోభిల్లాలని, తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదిగేలా దీవించాలని అమ్మవార్లను మొక్కుకున్నట్లు చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ప్రతీ ఒక్కరూ కలిసి మెలిసి సంతోషంగా జరుపుకుంటేనే అది నిజమైన పండుగ అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News