Monday, December 23, 2024

పదేళ్ల పాలన.. ప్రగతికి నమూనా

- Advertisement -
- Advertisement -

పదేళ్ల పాలన.. ప్రగతికి నమూనా

కెసిఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ

మన తెలంగాణ/హైదరాబాద్: కుటుంబాలు బాగుంటేనే గ్రామం బాగుపడుతుంది. గ్రామాలన్నీ బాగుంటేనే మండలం పచ్చగా ఉంటుంది. మండలాలన్నీ బాగుంటేనే జిల్లా బాగుంటుంది.. అలా జిల్లాలన్నీ అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అనే ఆర్థ్ధిక సూ త్రాన్ని ఒంటబట్టించుకొని సమర్థ్ధవంతమైన పాలనను అందిస్తున్న బిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ రోల్‌మోడల్‌గా నిలిపి ఘనకీర్తిని కైవసం చేసుకొంది. ఈ ఘనతను సాధించడానికి తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో ఏళ్లు, మరెన్నో దశాబ్దాల సమ యం పట్టలేదు. ఫట్టుమని పదేళ్లు కూడా నిండకముందే తెలంగాణ రాష్ట్రం ఈ ఘనతను సాధించింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి- పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా, కేంద్ర ప్రభుత్వానికి సైతం రోల్ మోడల్‌గా మారాయి.

ఈ ఘనకీర్తి ఎంతదాకా వెళ్లిందంటే తెలంగాణ రాష్ట్రంలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై కొన్ని రాష్ట్రాలు ఒత్తిడి చేయడం వరకు వెళ్లింది. కొన్ని రాష్ట్రాలైతే తెలంగాణ పథకాలకు పేర్లు మార్చి అమలు చేస్తున్నాయి కూడా. జూన్ 2న ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం ఒక కసితో, యుద్ధంలో గెలవాలనే ఒక యోధుడు చేసే పోరాటాల మాదిరిగా అభివృద్ధి-, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ జూన్ తేదీతో తొమ్మిదేళ్లు నిండి పదో ఏటలోకి అడుగుపెడుతున్న సంక్షేమ రాష్ట్రం తెలంగాణ.

స్వరాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉద్యమ సారధి కె.చంద్రశేఖర్‌రావు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి ఉద్యమం మాదిరిగానే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక పాలన, ప్రగతి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజ ల జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. బంగారు తె లంగాణ నిర్మాణం దిశగా ప్రారంభమైన ఈ ప్రయాణం దేశానికే కాదు మొత్తం మానవ సమాజానికి ఎన్నో పా ఠాలు, గుణపాఠాలను కూడా నేర్పింది. ప్రజా సంక్షే మం, అభివృద్ధే ధ్యేయంగా రాజనీతిజ్ఞతతో పనిచేసే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చునో తెలిపేందుకు తె లంగాణ రాష్ట్ర ప్రగతి

ఒక కొలమానంగా నిలిచింది. దీనికి నిలువెత్తు నిదర్శనం మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలోని రైతు, వ్యవసాయ విధానాలను అమలు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడమేనని ఉన్నతాధికారులు సగర్వంగా చెబుతున్నారు. అంతేగాక ప్రస్తుతం సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో మొదట తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్థ్ధిక అస్థిరత, అభద్రతలను ఎదుర్కొంటున్న నిరుపేదల కుటుంబాల్లోని వారికి ఆసరా పథకంతో సంక్షేమ కార్యక్రమాలకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 3.5 కోట్ల మంది (ప్రస్తుతం 4 కోట్ల మంది జనాభా) జనాభా ఉన్న రాష్ట్రంలో 44,12,882 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా ఆసరా పెన్షన్లు అందిస్తున్నారంటే ఆషామాషీ విషయం కాదని పలువురు ఆర్థ్ధికవేత్తలు సైతం వ్యాఖ్యానించారంటే ఈ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. 2014 జూన్ 2వ తేదీ నుంచి పదో వసంతంలోకి అడుగిడే వరకూ అన్నివర్గాల సంక్షేమమే లక్షంగా, దేశమే అచ్చెరువొందే రీతిలో పలు పథకాలను అమలు చేస్తూ కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ సంక్షేమ రంగంలో స్వర్ణయుగాన్ని లిఖించింది.

కల్యాణలక్ష్మీ (షాదీ ముబారక్), రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కెసిఆర్ కిట్, కెసిఆర్ న్యూట్రిషన్ కిట్, బర్రెలు, గొర్రెలు, చేప పిల్లల పంపిణీ, ఆత్మ గౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా, గిరిజన తండాలకు, గ్రామ పంచాయతీ హోదా గురు కులాలు, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు, బ్రాహ్మణులకు ఉన్నత విద్యార్జన కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలార్‌షిప్‌లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్షంగా ప్రభుత్వం ఎన్నో పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. తెలంగాణ మోడల్‌గా నిలిచిన తెలంగాణ ఆచరిస్తున్న పలు కార్యక్రమాలను, పథకాలను దేశంలోని అనేక రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది, ఆచరిస్తున్నది. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయ రంగం ప్రగతి నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ వ్యవసాయరంగం, వ్యవసాయాధారిత భారతదేశానికి ఒక నమూనా మార్పును తెచ్చిందని జాతీయస్థాయిలోని రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కీర్తించిన వైనమే నిలువెత్తు నిదర్శనం. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల గుండెల్లో రైతు బాంధవుడిగా కొలువై ఉండటం వెనుక 60ఏళ్ల ఉద్యమాలు, పోరాటాలకు జవాబు ఉంది.

నేడు తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు సంక్షేమ శిఖరాన నిలిచి ప్రగతి ఫలాలను అనుభవిస్తున్నారంటే అందుకు ఆయా వర్గాల పట్ల సీఎం కెసిఆర్‌కు ఉన్న నిబద్ధతకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ సాకారంతో వెనుకబడిన తరగతులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆర్థ్ధిక స్వావలంబన సాధిస్తున్నారు. గంగా జమునా తెహజీబ్ కు నిలయమైన తెలంగాణలో మైనారిటీలు దేశంలో మరెక్కడా లేనివిధంగా భరోసాతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ వస్తే ఏ మొచ్చిందని అడిగినోళ్లకు నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరిస్తున్న అద్భుత విజయాలే సాక్షంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత తొమ్మిదేళ్ల కాలంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సంక్షేమ, విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News