Sunday, December 22, 2024

తలసరి ఆదాయంలో మనదే పైచేయి

- Advertisement -
- Advertisement -

ఎనిమిదేళ్లలో తెలంగాణ తలసరి ఆదాయం పెరుగుదల రెట్టింపుకన్నా
ఎక్కువ జాతీయ తలసరి ఆదాయం రెండింతలు కూడా పెరగలేదు
జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే రాష్ట్ర ఆదాయం 1.9
రెట్లు ఎక్కువ జిడిపిలో రాష్ట్ర జిఎస్‌డిపి వాటా 4.1శాతం
నుంచి 4.9శాతానికి పెరుగుదల కరోనా కాలం
లోనూ పాజిటివ్ వృద్ధి రేటు సాధించిన తెలంగాణ
అదుపులోనే రాష్ట్ర అప్పులు విపక్ష కాంగ్రెస్,
బిజెపిలది అసత్యాలేనని నిరూపించిన కేంద్ర నివేదిక
ఏ కోణంలో చూసినా కేంద్రానిది దిగదుడుపే

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆస్తులు, తలసరి ఆదాయాన్ని పెంచడంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకు పోతున్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావించిన తరువాత గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. రాష్ట్రంలో అప్పులు పెరగడంతో పాటుగా ఉత్పాదక ఆస్తులు, తలసరి ఆదాయం సైతం అనూహ్యంగా పెరిగింది. వీటి గణాంకాల్లో కేం ద్రంతో పోలిస్తే రాష్ట్రం అనేక కోణాల్లో గణనీయమైన వృద్ధిని సాధించినట్లుగా వెల్లడైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన ( 2014..20-15) నాటి నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తోంది. 2014లో రాష్ట్ర త లసరి ఆదాయం రూ.1,24,104 కాగా, ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,78,833కు చేరికుం ది. అదే సమయంలో జాతీయస్థాయిలో తలసరి ఆదాయం కేవలం రూ. 1, 49,848 మాత్రమే. అంటే జాతీయస్థాయితో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదా యం 1.9 రెట్లు పెరిగింది. రాష్ట్ర అప్పులపై విపక్ష కాంగ్రెస్, బిజెపి చేస్తున్నవి అసత్య ప్రచారమేనని భారత ప్రభుత్వ ఆధీనంలోని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మరోసారి లోక్‌సభ వేదికగా గణాంకాలను ప్రకటించింది.

రాష్ట్రంలోని అప్పులపై విపక్ష పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం ఈ వివరాలను వెల్లడించింది. కాగా ఈ అంకెలను చూసి అయినా రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు విమర్శలు చేయడం మానుకోవాలని తెలంగాణ వాదులు ఈ సందర్భంగా సూచిస్తున్నారు. అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి యత్నించడం తగదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలో మోడీ అధికారాన్ని చేపట్టే నాటికి ( మార్చి 2014)లో దేశ అప్పులు రూ. 55,87,149.33 కోట్లు కాగా, ఇవి వచ్చే సంవత్సరం మార్చి నాటికి రూ.152,17,910.29 కోట్లకు చేరుకోనుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే కేంద్ర రుణాలు మరో రూ. 96.30 లక్షల కోట్లు పెరుగనున్నాయి. కాగా రాష్ట్ర రుణాలు రాష్ట్ర రుణాలు 2014లో 2,25,418 కోట్లు ఉండగా, 2022లో రూ. 3,12,191.3 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే దేశాన్ని సాకుతున్న నాలుగైదు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని అని తరుచూ సిఎం కెసిఆర్ చెబుతుంటారు. దీనికి కేంద్ర లెక్కలే నిదర్శనమని తెలుస్తోంది. మన రాష్ట్ర జిఎస్‌డిపి పెరుగటమే కాదు…దేశ జిడిపిలో వాటాను క్రమంగా పెంచుకొన్నది.

2014..20-15లో దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్‌డిపి వాటా 4.01 శాతం కాగా, ఇప్పుడది 4.97 శాతానికి పెరిగింది. దేశంలోని పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే జిఎస్‌డిపి (రూ.11.54 లక్షల కోట్లు)లో రెండవ స్థానం, తలసరి ఆదాయ (2.78 లక్షలుగా) వృద్ధిలో మొదటి స్థానంలో తెలంగాణ కొనసాగుతోంది. అలాగే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జిఎస్‌డిపి) స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. వృద్ధిరేటులో అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తున్నది. చివరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా ప్రభావం ఉన్న 2019..20-20, 2020..20-21లోనూ వెనక్కి తగ్గలేదు. జిడిపితోపాటు అనేక రాష్ట్రాల వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లినా, రాష్ట్రం మాత్రం పాజిటివ్ వృద్ధి సాధించింది. తెలంగాణ ఏర్పడిన కేవలం ఏడెనిమిది సంవత్సరాల్లోనే అనేక రాష్ట్రాల కంటె ఎన్నెన్నో రెట్లు ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకుపోతున్నది.

ప్రధానంగా వ్యవసాయం ఆర్థిక ప్రగతికి చోదకశక్తిగా మారింది. నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధి కూడా శరవేగంగా సాగుతోంది. ఇలా ఒకటేమిటి…. ఒకపక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మరో పక్క పట్టణ ఆర్థిక వ్యవస్థ సమాంతరంగా పరుగులు పెడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిస్తున్న తెలంగాణ సొంత రాబడుల్లో ఇతర రాష్ట్రాలకు అందనంత ఎత్తులో నిలుస్తోంది. గతంలో దండగ అనుకున్న వ్యవసాయం.. నేడు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇంజిన్‌గా మారింది. ఉత్పత్తి రంగంలో ఏకంగా 72 శాతం వృద్ధి కనబరచగా నిర్మాణ రంగం సైతం జిఎస్‌డిపిలో మూడేండ్లుగా ఏటా రూ.37 వేల కోట్ల వాటాను నమోదు చేస్తున్నది. మైనింగ్, క్వారీయింగ్ రంగం వాటా రెట్టింపు కావడం విశేషం.

ప్రతి యేటా జిఎస్‌డిపి పెరుగుదల

దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్‌డిపి ప్రతి సంవత్సరం పెరుగుతోంది. 2014..2015లో 4.1శాతం, 2015..2016లో 4.2 శాతం, 2016..2017లో 4.3శాతం, 2017…2018లో 4.4శాతం, 2018…2019లో 4.5 శాతం, 2019..2020లో 4.7శాతం, 2020..2021లో 4.9శాతం, 2021…2022లో కూడా 4.9 శాతంగా నమోదు చేసింది.

అదుపులోనే అప్పులు

రాష్ట్ర ఆదాయం పెరుగడమే కాదు.. అప్పులు కూడా అదుపులోనే ఉన్నాయి. రాష్ట్ర జిఎస్‌డిపిలో 25 శాతానికి మించి అప్పులు ఉండొద్దన్నది కేంద్రం నిబంధన. ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిని రాష్ట్రం ఏనాడూ అతిక్రమంచలేదని గణాంకాలు చెబుతున్నాయి. ప్రసుతం రాష్ట్ర జిఎస్‌డిపిలోఅప్పులు 22.83 శాతంగా ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలోని 18 రాష్ట్రాల అప్పులు ఎఫ్‌ఆర్బీఎం పరిమితికి మంచి నమోదయ్యాయి. తెలంగాణ 25వ స్థానంలో ఉన్నది. కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర మాత్రమే తెలంగాణ కన్నా తక్కువగా అప్పులు చేశాయి.

సొంత రాబడుల్లో టాప్

సొంత పన్ను రాబడుల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014..20-15తో పోల్చితే సొంత రాబడులు 90 శాతం పెరిగాయి. వార్షిక సగటు వృద్ధి 11.52 శాతంగా నమోదైంది. మిగతా రాష్ట్రాలకు అందనంత ఎత్తులో ఉన్నది. ఈ జాబితాలో 9.78 శాతంతో ఒడిశా రెండో స్థానంలో 8.9 శాతం వృద్ధితో జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచాయి. గుజరాత్‌లో వార్షిక సగటు వృద్ధి 2.59 శాతంగా నమోదైంది.

అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి

తెలంగాణ గత ఏడేండ్లలో అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధించింది. ముఖ్యంగా ప్రాథమిక రంగం కరోనా విపత్తును ఎదుర్కొని అత్యధిక వృద్ధిని నమోదుచేసింది. జాతీయ సగటుతో పోల్చినప్పుడు ప్రాథమిక రంగం, సేవారంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. వాటిల్లో ప్రదానంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంవర్ధకం, అటవీ పర్యావరణ, మత్స, ఆక్వా కల్చర్, మైనింగ్ వంటి రంగాలు ప్రాథమిక రంగం కిందికి వస్తాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని 55 శాతం ప్రజలకు ప్రాథమిక రంగమే ఉపాధి కల్పిస్తున్నది. మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, గొర్రెల పంపిణీ వంటి పథకాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలదే మేజర్ వాటా. అలాగే ఉత్పత్తి, నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, వసతులు తదితర విభాగాల్లో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధిస్తోంది. గత ఏడేండ్లలో ఈ రంగం రాష్ట్ర జిఎస్‌డిపిలో సుమారుగా 18 శాతం వాటా నమోదు చేస్తోంది.

ఇక వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీస్లు, రవాణా, కమ్యూనికేషన్స్, బ్రాడ్‌కాస్టింగ్ వంటి సేవల ద్వారా రాష్ట్ర జిఎస్‌డిపిలో ఏకంగా 59.5శాతం వాటాను నమోదుచేసింది. ఇక దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటలపాటు కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. 24.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా కరెంటు సరఫరా అవుతున్నది. ఈ రాయితీ విలువ ఏటా రూ.10 వేల కోట్లకుపైనే ఉంటుంది. 2014-..2015లో రాష్ట్రంలో 39,519 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఇప్పుడు ఏకంగా 58,515 మిలియన్ యూనిట్లకు పెరిగింది. తలసరి విద్యుత్ వినియోగంలో ప్రస్తుతం దేశంలోనే ఐదో స్థానంలో ఉన్నది. సంస్థాగత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2014 జూలైనాటికి 7,778 మెగావాట్లు కాగా, ప్రసుత్తం 109 శాతం వృద్ధిని కనబరుస్తూ 16,249 మెగావాట్లకు పెరిగింది. అస్థిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి నేడు ప్రపంచం ముందు సగర్వంగా నిలుస్తోంది.

తలసరి వృద్ధి రేటులో మొదటి స్థానం

2021-…2022లో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధిరేటులో రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక ఉన్నాయి. స్థిర ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.62 లక్షలుగా ఉందని గణాంకాల శాఖ ఇచ్చిన నివేదిక స్పష్టం చేసింది. . డబుల్ ఇంజిన్ గ్రోత్‌గా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉండడం విశేషం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News