Monday, December 23, 2024

పల్లెల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర లక్ష్యం: ఎంఎల్‌ఎ చిన్నయ్య

- Advertisement -
- Advertisement -

కాసిపేట: మారుమూల పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య అ న్నారు. సోమవారం కాసిపేట మండలంలోని సోనాపూర్, దేవాపూర్, మద్దిమాడ, గట్రావ్‌పల్లి గిరిజన గ్రామ పంచాయితీలలో ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలకు ఎంఎల్‌ఎ చిన్నయ్య శ్రీకారం చుట్టారు.

మండలంలోని మారుమూల గిరిజన గ్రామం సోనాపూర్ పంచాయతీలో రూ. 23 లక్షల వ్యయంతో మన ఊరు మనబడి కార్యాక్రమం ద్వారా నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం గట్రావ్‌పల్లి గ్రామపంచాయతీలో రూ. లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పంచాయతీ భవనం నిర్మాణానికి, దేవాపూర్ గ్రామ పంచాయతీ పరిదిలో రూ. 15 లక్షల వ్యయంతో చేపట్టిని సిసి రోడ్డు నిర్మాణానికికు శంకుస్థాపన చేశారు.

అలాగే రూ.7 లక్షల రుపాయల వ్యయంతో దేవాపూర్‌లో నిర్మించిన మహిళ సమాఖ్య భవనంను ఆయన ప్రారంభించారు. అలాగే మద్దిమాడ గ్రామ పంచాయతీలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవనంకు శంకుస్థాపన చేశారు. రూ. 5 లక్షల డిఎంఎఫ్‌టి నిధులతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనం, మండల పరిషత్ నిధులు రూ. 4 లక్షలతో సిసి రోడ్డు, రూ. 3 లక్షల వ్యయంతో సైడ్ డ్రైయిన్ నిర్మాణానికి ఎంఎల్‌ఎ చిన్నయ్య శంకుస్థాపనలు చేశారు.

అనంతరం హరిత హారం కార్యాక్రమంలో భాగంగా అన్ని పంచాయతీలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి పంచాయతీల అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నాడన్నారు. ఇప్పటికే ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిన ప్రభుత్వం నేడు ప్రజల సుఖశాంతుల కోసం కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పి వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, జడ్‌పిటిసి పల్లె చెంద్రయ్య, ఎంపిపి రొడ్డ లక్ష్మీ, వైస్ ఎంపిపి పుస్కూరి విక్రంరావ్, పార్టీ అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి, సర్పంచ్‌లు మడావి తిరుమల, ఆడే జంగు, పెంద్రం రాజు, కొట్నాక సుశీల, మార్కెట్ కమిటి డైరెక్టర్ ఏనుగు మంజూలారెడ్డి, ఎంపిడివో ఎంఎ. అలీం, ఎంపివో నాగరాజ్, ఎంఈవో వాసాల ప్రభాకర్, కార్యదర్శులు కవిత, తనూజ, మానస, ప్రజాప్రతినిధులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News