ఏ ఆధునిక యక్ష ప్రశ్నలకైనా సమాధానాలు ఠకీమని చెప్పగల చాట్ జిపిటి, డీప్ సీక్, ఏఐ యు గంలో కొంతమంది ప్రేక్షకుల ఎదుట ఓ నలుగురు కూచుని ఒక విషయం పై తీవ్రంగా చర్చించి తర్జన భర్జన పడి కుస్తీలు పట్టి ఆ విషయం అంతు చూసి ఈ వర్చువల్ ధర్మరాజులకన్నా లోతైన ప్రతిపాదనలను సాధించగలరా, ఏఐ ని మించిన విస్తారమైన విశ్లేషణ చేయగలరా, కృత్రిమ మేథ అందుబాటులో ఉన్న కాలంలో సభికులకు ఈ చర్చ ఏదో కొత్త విషయం అందించగలదని అనుకోవడం స మంజసమేనా, ఫోన్ తెరిచి తెలంగాణ కథ విశ్లేషణ అని సెర్చ్ చేస్తే బోలెడు సమాచారం వచ్చి పడుతుంది కదా, దానికోసం ఒక సభలో మూడు గం టలు కూచోవడం అవసరమా..
ఇవీ ఖమ్మంలో ఇటీవల జరిగిన కథానిలయం 28వ వార్షికోత్సవ వేడుకలో ని పానల్ డిస్కషన్ కు ముందు నాలాంటి వాళ్లను తొలచిన సందేహాలు. పానల్ డిస్కషన్ మొదలైంది కూడా ఈ ప్రశ్నతోనే. కథా నిలయం శ్రీకాకుళం వారు ప్రతి ఏటా జరిపే వార్షికోత్సవం లో ఒక పానల్ డిస్కషన్ కచ్చితంగా ఉండడం ఆనవాయితీ. ఈ ఏడు తెలంగాణ కథ, సమాజ కేం ద్రకం, వ్యక్తి కేంద్రకం అనే అంశాన్ని నిర్దారించి అందుకు మోడరేటర్‌గా నన్ను, పానలిస్టులుగా సంగి శెట్టి శ్రీనివాస్, కెపి అశోక్ కుమార్, దేవకీ దేవి లను ఎంచుకున్నారు. ముగ్గురు పానలిస్టులు తెలంగాణ పట్ల ప్రేమ, అవగాహన తెలంగాణ కథ పట్ల సాధికారత ఉన్నవాళ్లు కావడం ఈ ఎంపికకు కారణం. ఏ కథా రాయని నన్ను మోడరేటర్ గా ఎందుకు ఎంచుకున్నారో కారణం నాకైతే తెలియ దు.
తెలంగాణ, తె లంగాణ కథ అనేవి నాకు ఇష్టమైన అంశాలు కా వడం వల్ల అంగీకరించాను, నా ఎంపికకు న్యాయంకూడా చేసానని నాకైతే తెలియదు కానీ అం దరూ అంటుంటే ఆ తరవాత తెలిసింది. కృత్రిమ మేథ కంటే పానలిస్టులు అదనంగా ఏం చెప్పగలరు అనే ప్రశ్నతో మొదలైన చర్చ తెలంగాణ కథకు సంబంధించిన అనేక అంశాలను స్పృశించింది. ఎంత చాట్ జిపిటి అయినా ఎంత డీప్ సీక్ అయినా అంతిమంగా మానవ మేథ ఇచ్చిన ఇన్ పుట్ తోనే కొత్త నిర్దారణలు చేయాలి కనుక నలుగురు ఒక చోట కూచుని జరిపే మేథోమథనం కచ్చితంగా గొప్ప ప్రతిపాదనలను చేయగలుగుతుందని పానలిస్టులు స్థిరంగా అభిప్రాయపడ్డారు. అసలు సామాజిక కేంద్రకం.. వ్యక్తి కేంద్ర కం అంటే ఏమిటి, సృజనకారులు వ్యక్తి కేంద్రకంగా రచన చేస్తారా, నిజానికి తెలంగాణ కథ అంటే ఏమిటి, తెలంగాణ కథ ప్రస్థానం ఎక్కడనుంచి ఎక్కడకు చేరుకుంది. నడిచొచ్చిన దారి ము ఖ్యమా చేరాల్సిన గమ్యం ముఖ్యమా, తెలంగాణ లో రావల్సినంత ఎక్కువగా మాండలికంలో కథలు ఎందుకు రావడం లేదు, తెలంగాణ కథలో నిర్మాణపరమైన ప్రయోగాలు ఎందుకు తక్కువగా జరుగుతున్నాయి , తెలంగాణ కథకులకు జీవితాన్ని ఆదర్శంతో గార్నిష్ చేయడం ఎందుకు రావడం లేదు,
తెలంగాణ కథలలో వైయక్తిక సంఘర్షణలకంటే సమాజానికి ఏదో ఒకసందేశం ఇవ్వాలన్న తాపత్రయం ఎందుకు ఎక్కువగా కనపడుతోంది, ఇతర ప్రాంతాల కధకులకు తెలంగాణ కథకులు నేర్పే మంచి గుణం ఏమిటి, తెలంగాణ కథకులు ఇతర ప్రాంతాల కథకుల నుంచి నేర్చుకోవల్సిన అంశాలు ఏమిటి అనే సందేహాల చుట్టూ చర్చ జరిగిం ది. ఏ రచనైనా నూటికి నూరు శాతం వ్యక్తి కేంద్రకంగా ఉండదనీ అది కచ్చితంగా ఎంతో కొంత సామాజిక కేంద్రకమై పాఠకులకు ఉద్దీపననిస్తుందనీ పానలిస్టులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రాంతానికి చెందినవారు తెలంగాణ గురించి రాసే కథలన్నీ తెలంగాణ కథలేనన్న అభిప్రాయాన్ని పా నలిస్టులు వ్యక్తం చేయడంతోపాటు ఇతర ప్రాంతా ల వారు ఒక వేళ తెలంగాణ వేదన గురించి న టించి రాసినా దానిలో ఆత్మ ఉండదనీ, అందులో నిజాయితీ ఉండదని కూడా పానలిస్టులు అభిప్రాయపడ్డారు. అవి తెలంగాణ కథలు కావని కూడా తేల్చి చెప్పారు.
తెలంగాణ మాండలికంలో కథలు తక్కువగా వస్తున్నాయన్న వాదనను పానలిస్టులు అంగీకరించలేదు. సంగిశెట్టి శ్రీనివాస్ మాత్రం అస లు తెలంగాణ ఒక భాష అనీ దాన్ని మాండలికం అనకూడదని బలంగా వాదించారు. తెలంగాణ కథలో నిర్మాణ పరమైన ప్రయోగాలు చాలా తక్కువగా జరుగుతున్న మాట నిజమేననీ, అందుకు అధ్యయనలోపమే కారణమనీ దానివల్లనే జీవితాన్ని ఆదర్శంతో గార్నిష్ చేయడంలో తెలంగాణ కథకులు విఫలమవుతున్నారనీ అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఒక జీవన వాస్తవాన్ని చెప్పదలుచుకున్నపుడు, నిర్మాణ వ్యూహాలు, గార్నిషింగ్ లాంటి అదనపు అలంకారాలూ అవసరం లేదని కూడా ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దళిత మైనారిటీ కథ లు బలంగా ఉధృతంగా వస్తున్నాయని కూడా పానలిస్టులు అభిప్రాయపడ్డారు. దళిత కథలు తెలంగాణ నుంచి వచ్చినంత బలంగా ఏ ఇతర భాషలో కూడా రావడం లేదన్నది పానలిస్టుల భావన. కొత్త కథకులు తెలంగాణ నుంచి రావడం లేదన్న విషయంలో చిన్న చిన్న అభిప్రాయభేదాలతో అందరూ ఏకగ్రీవమయారు. కొత్త కథకులు రావడం లేదు అనేకంటే రావల్సినంత రావడం లేదని, కొత్త కథకులను తయారు చేసుకోవల్సిన బాధ్యత కూడా తెలంగాణ సాంస్క్రుతిక సమాజంపై ఉందనీ పానలిస్టులు సూచించారు. తెలంగాణలో కథకు అవసరమైన ముడి సరుకు లెక్కలేనంత ఉందనీ ఇప్పటికీ దుఖ్కం, ఇప్పటికీ వేదన, ఇప్పటికీ రైతు జీవన విధానంలోని ఎగుడు దిగుళ్లు, నీళ్లు దొరకని కన్నీళ్లు, కడుపు మండుతున్న యువతరం విషాదాలకు ప్రతీకలుగా ఉన్నాయనీ వాటిని కథలు చేయ డం అవసరమనీ పానలిస్టులు సూచించారు.
మొత్తంగా చూస్తే రూపపరమైన అవగాహనను తెలంగాణ కథకులు పెంచుకోవాలనీ, కొత్త కొత్త ఇతివృత్తాల అన్వేషణలో నిత్యం మునగాలనీ, కథకు సం బంధించి అధ్యయనం కథకులకు అవసరమనీ చ ర్చ తేల్చింది. తెలంగాణ కథకులకు అధ్యయనం చాలా అవసరం అన్న అంశాన్ని కెపి అశోక్ కుమా ర్ బలంగా వినిపించారు. ఈ చర్చ తెలంగాణ కథకులకు పాఠకులకు తెలియని అనేక విషయాలను చెప్పగలిగిందని సంగిశెట్టి శ్రీనివాస్ అంటే తెలంగాణ కథకు సంబంధించిన ఏ అంశాన్నీ వదలకుండా అన్ని కోణాలనూ ఈ చర్చ విశ్లేషించిందని కెపి అశోక్ కుమార్ అన్నారు. చర్చలో పాల్గొనడానికి వచ్చిన తాను విద్యార్దిగా మారి అనేక విషయాలు కొత్తగా తెలుసుకున్నానని దేవకీ దేవి అన్నా రు. ఈ చర్చ జరగడానికి కారణమైన కథానిలయం వారిని ఖమ్మం ఈస్థటిక్స్ వారిని ముగ్గురు పానలిస్టులుూ అభినందించారు. ముగ్గురు పానలిస్టుల మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదుకానీ వాటి గురించి కూడా సామరస్యం గానే ప్రస్తావించుకోవడం, చర్చను విస్త్రుతం చేయడానికి దోహదపడేట్టుగా మాత్రమే ప్రతిపాదనలు చేయడం చర్చకు ఒక నిండుదనాన్నిచ్చింది. ఉప్పునిప్పుగా ఉన్న కెపి అశోక్ కుమార్, సంగిశెట్టి శ్రీనివాస్ లను ఒకే వేదిక మీద మూడుగంటల పాటు కూచోపెట్టి బోలెడంత ప్రశాంతంగా ముగించడం నా విజయంగా కనిపిస్తున్నాఅది కేవలం వాళ్లిద్దరి సంస్కారం, సంయమనం వల్ల మాత్రమే సాధ్యం అయిందని నాకు తెలుసు.
వాళ్లిద్దరికీ నా కృతజ్ఞతలు. చివరగా ఓ మాట.. ఈ చర్చకు మోడరేటర్‌గా నన్ను నేను సిద్దం చేసుకుంటున్న సమయంలో ఒక చిలిపి పని చేయాలనిపించి డీప్ సీక్‌కు ఈ అంశాన్ని ఇచ్చి సంబంధిత ప్రశ్నలు కావాలని అడిగాను. డీప్ సీక్ ఓ ఇరవై ప్రశ్నలు ఇచ్చింది. అవి మరీ నాసిరకం. ఆ ప్రశ్నలనే మళ్లీ డీప్ సీక్ కు ఇచ్చి సమాధానాలు చెప్పమని అడిగాను. ఆ సమాధానాలు కూడా నాసిరకమే. చివర్లో చర్చకు ముందురోజు నేను సిద్దం చేసుకున్న ప్రశ్నలను కూడా డీప్ సీక్‌కు ఇచ్చి సమాధానాలు తీసుకున్నాను. అవి కూడా పరమ నాసిరకంగా ఉన్నాయి. చివరకు చర్చ ముగిసిన తరువాత మాత్రం డీప్ సీక్ కంటే సంగిశెట్టి, అశోక్ కుమార్, దేవకీ దేవి వందలవేల రెట్లు సమర్దులైన విశ్లేషకులని నాకు అర్దమైంది. వాళ్ల సమాధానాలు, వాళ్ల అవగాహన, వాళ్ల వివరణలు ఎంత భిన్నంగా ఉన్నాయో ఎంత ఆధునికంగా ఉన్నాయో ఎన్ని కొత్త కోణాలను చూపగలిగాయో అర్దమైంది. ఎంత కృత్రిమ మేథ అని మనం అబ్బురపడుతున్నా, లేదూ భయపడుతున్నా మానవ మేథకు, మనిషి ఆలోచనా సరళి లోతులకు అది ఏమాత్రం సరితూగదన్నది అక్షరాలా నిజం. మనిషి మెదడును నకలు చేసే మెదడింకా పుట్టలేద న్నది వాస్తవం. రాయగలిగితే ఇదొక కథాంశం.
ప్రసేన్