Thursday, January 23, 2025

ఐఐటి ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్‌లోని ఐకానిక్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)లోని విద్యార్థుల హాస్టల్ నుండి బుధవారం అనుమానాస్పద పరిస్థితుల్లో నాల్గవ సంవత్సరం విద్యార్థి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థిని తెలంగాణ వాసి కె కిరణ్ చంద్ర (21)గా గుర్తించారు. దురదృష్టకర సంఘటన గురించి తెలంగాణలోని కె కిరణ్ చంద్ర తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

కిరణ్ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. మృతుడు అతని హాస్టల్ లో ఉరివేసుకుని కనిపించాడు. అతన్ని ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిడ్నాపూర్ మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. ఇది ఆత్మహత్యగా ప్రాథమికంగా భావించినప్పటికీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News