Monday, December 23, 2024

అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తులతో దాడి.. స్పందించిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తులతో దాడి ఘటనపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ స్పందించారు. అమెరికాలో భారతదేశ రాయబార కార్యాలయం, తన ఎన్నారై స్నేహితుల సహాయంతో విద్యార్థి వరుణ్‌కు కావాల్సిన సహకారాన్ని అందిస్తాని తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో వరుణ్ కుటుంబ సభ్యులతో తమ టీమ్ టచ్‌లో ఉంటారని, వారికి కావాల్సిన సహాయం అందిస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ తరుణంలో వరుణ్‌రాజ్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.

ఘటన జరిగిందిలా…
అమెరికాలో ఎంఎస్ చదువుతున్న తెలంగాణ విద్యార్థిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఖమ్మంలోని మామిళ్లగూడేనికి చెందిన పుచ్చా వరుణ్‌రాజ్ ఇండియానా రాష్ట్రంలోని వాల్‌పరైసో నగరంలోని ఓ విశ్వవిద్యాలయంలో. ఎంఎస్ చదువుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మంగళవారం జిమ్ నుంచి వరుణ్ ఇంటికి వెళ్తుండగా ఒక దుండగుడు కత్తితో కణతపై పొడిచాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వరుణ్‌కు శస్త్రచికిత్స చేశారని యువకుడి తండ్రి రామ్మూర్తి తెలిపారు.

వరుణ్‌పై దాడి చేసిన జోర్డాన్ ఆండ్రాడ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరుణ్‌పై ఆండ్రాడ్ కత్తితో బలంగా దాడి చేశాడని, గాయం తీవ్రంగా ఉందని, పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని ఇండియానా పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వరుణ్ అపస్మారక స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రామ్మూర్తి మంత్రి పువ్వాడ అజయ్‌ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News