Thursday, March 6, 2025

అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

చదువు లేదా ఉద్యోగం కోసం చాలా మంది భారతీయులు అగ్రరాజ్యం అమెరికాకు వెళ్తుంటారు. ఇందులో తెలుగువారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే అలా చదువు కోసం అమెరికా వెళ్లిన ఓ తెలంగాణ విద్యార్థి కథ విషాదాంతమైంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన గంప ప్రవీణ్(27) ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అక్కడ మిల్వాకీ కౌంటీలో ఉంటూ ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే దుండగులు ప్రవీణ్‌పై కాల్పులు జరపగా.. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రవీణ్ మరణవార్త తెలియగానే అతని కుటుంబసభ్యులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. అతని మృతితో కేశంపేట గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News