Monday, December 23, 2024

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అమెరికాలో చదువుతున్న తెలంగాణకు చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భూత్పూర్ మండలం, మహబూబ్ నగర్‌లోని కప్పెట్ట గ్రామానికి చెందిన బోయ మహేష్ (25) కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్ డిగ్రీ చదివేందుకు డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు.

మంగళవారం రాత్రి మహేష్ తన స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌లతో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాడు. దురదృష్టవశాత్తు వారు ప్రయాణిస్తున్న కారు అడవి జంతువును ఢీకొనొ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో మహేశ్‌ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. మహేశ్‌ అకాల మరణవార్త బుధవారం ఆయన కుటుంబ సభ్యులకు తెలియడంతో కప్పాట గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌లతో కలిసి లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మహేష్ మరణవార్త బుధవారం ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. దీంతో కప్పట గ్రామంలో విషాదం నెలకొంది. మహేష్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News