కొల్‌కతా : ఐఐటి ఖరగ్‌పూర్‌లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కె కిరణ్ చంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ 22 సంవత్సరాల విద్యార్థి బ్యాక్‌లాగ్స్, పరీక్షల ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడ్టట్లు వెల్లడైంది. ఉన్నత విద్యాసంస్థలు, పోటీ పరీక్షల విద్యార్థులు తీవ్రస్థాయి మానసిక ఒత్తిళ్లకు గురై బలవన్మరణాలకు పాల్పడటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. తమ విద్యాసంస్థ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తమను కలిచివేసిందని ఐఐటి విద్యాసంస్థ విద్యార్థులు, సిబ్బంది, ఫ్యాకుల్టీ నుంచి సంయుక్తంగా ఓ ప్రకటన వెలువడింది.
తెలంగాణలోని మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన ఈ విద్యార్థి కొన్ని పరీక్షలు ఇంకా మిగిలి ఉండటంతో మానసిక ఒత్తిడికి గురయి ఉంటారని అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ విద్యార్థి తన హాస్టల్ రూంలో ఫ్యానుకు ఉరివేసుకుని వేలాడుతూ ఉండటాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. ఆత్మహత్యకు పాల్పడినట్లు, తోటి వెల్లడైంది. కాలేజీ, హాస్టల్ యాజమాన్యం ఇది ఆత్మహత్య అని పేర్కొంటోంది. అయితే ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని పోలీసు అధికారులు తెలిపారు.