Sunday, December 22, 2024

నీట్ కౌన్సెలింగ్‌లో ఉపశమనం

- Advertisement -
- Advertisement -

మన : నీట్ కౌన్సెలింగ్‌లో స్థానికత వ్యవహారంలో రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది. కౌన్సెలింగ్‌కు విద్యార్థులు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సమయం తక్కువగా ఉండటంతో అనుమతించినట్లు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ ఒక్కసారే అవకాశం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. స్థానికత వ్యవహారం పై హైకోర్టు తీర్పును సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభు త్వం పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. స్థానికతను నిర్ధారిస్తూ నాలుగు తీర్పులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తీర్పులు స్పష్టంగా ఉన్నా, మళ్లీ కోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్ర భుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ వాదనలను విద్యార్థుల తరఫు న్యాయవాది విభేదించారు. రెండు, మూడేళ్లు రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికతను ఎలా తీసేస్తారని అన్నారు. దీనిపై స్పందించిన సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం మెరిట్స్‌లోకి వెళ్లేంత సమయం ఇప్పుడు లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని సిజెఐ జస్టిస్ చంద్రచూడ్ అడిగారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తదుపరి విచారణకు ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టుకు ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News