- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ 100 ఏళ్ల విధ్వంసానికి గురయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అన్నారు. తెలంగాణ సంస్కృతి, ఆర్థిక పునరుద్ధరణ కోసం తన ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ప్రసంగిస్తూ దశాబ్దాలుగా కోరుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా సోనియా గాంధీ సందేశం వీడియోను ప్రదర్శించారు. 2014లో పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో సోనియా గాంధీ, మాజీ స్పీకర్ మీరా కుమార్, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్ కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఉన్నంత వరకు సోనియా గాంధీ గుర్తుంటారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ ఆమెను ఓ అమ్మలా గౌరవిస్తుందన్నారు.
- Advertisement -