Monday, November 18, 2024

అమరుల త్యాగఫలమే తెలంగాణ స్వరాష్ట్రం

- Advertisement -
- Advertisement -

సిరిసిల్ల: అమరుల త్యాగ ఫలమే తెలంగాణ స్వరాష్ట్రమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్య క్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణను 1956లో ఆంధ్రలో కలిపినప్పుడే ప్రజల్లో తెలంగా ణ ప్రత్యేక రాష్ట్ర భావన వచ్చిందన్నారు. నైజాం సర్కార్‌నుండి విముక్తి కల్పించేందుకు అప్పటి ప్రజలు పోరాటాలు చేశారన్నారు. సమాజంలో పెత్తందారులు సామాన్యప్రజలను అణగదొక్కిన చీకటి రోజులు 1946 నుండి 1948 వరకు ఉండేవన్నారు.

తెలంగా ణలో ప్రజలు వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగించారన్నారు.సిరిసిల్ల ప్రాంతంలో కూడా ఈ పోరాటం సాగిందన్నారు. సిరిసి ల్ల జిల్లాలో కూడా పెత్తందారులు, నైజాంకు వ్యతిరేకంగా ప్రజలు తుపాకుల చేతబట్టి పోరాటం చేశారన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబానికి పోరాట చరిత్ర ఉందన్నారు.

మన పెద్దలను ఎవరిని కదిలించినా చరిత్రంతా చెపుతారన్నారు. గత చరిత్రను తెలుసుకున్నవాడే చరిత్రను నిర్మిస్తాడన్నారు.తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని 2001లో కెసిఆర్ నేతృత్వంలో ప్రారంభించారన్నా రు. ఇది అయ్యేదేనా అని తొలినాళ్లలో ఎగతాళి చేశారన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఉద్యమ తొలి దశలో పలుమార్లు గెలుపోటములు చూసినా లేచి నిలబడి కొట్లాడామన్నారు.

కెసిఆర్ ఎంఎల్‌ఏగా, డిప్యూటి స్పీకర్‌గా ఉండి పదవులు తృణప్రాయంగా వదిలేసి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఉద్యమంలోకి దూకారన్నారు.చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించి తెలంగాణ కోసం ఉద్యమించారన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకూడదని కేసిఆర్ శాంతియుత ఉద్యమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

2009 డిసెంబర్ వరకు ఉద్యమంలో ఏ ఒక్కరు మరణించలేదన్నారు. 2009 డిసెంబర్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత ప్రకటించి దాన్ని వెనక్కి తీసుకోవడంతోనే ప్రాణనష్టం జరిగిందన్నారు.పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. గడిచిన తొమ్మిదేళ్ళుగా అమరుల ఆశయాలే స్ఫూర్తిగా, ప్రజల ఆత్మగౌరవమే ఆకాంక్షలే ఊపిరిగా, తెలంగాణ ఉద్యమ నినాదాలే మైలురాళ్లుగా దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం సిఎం కెసిఆర్ కృషి సాగిస్తున్నారన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని మరింతగా అభివృధ్ది చేస్తారన్నారు.ఈ సందర్భంగా అమరుల కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు.ఉద్యమకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జడ్‌పి సిపి అరుణ, ఎంసిపి జిందం కళచక్రపాణి, కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్‌పి అఖిల్ మహజన్, సెస్ చైర్మన్ చి క్కాల రామారావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ కమీషనర్ సమ్మయ్య, బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
బస్సు ప్రమాద బాధితులకు పరామర్శ
బుధవారం సిరిసిల్ల జిల్లా వల్లంపట్ల వద్ద ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తాపడిన బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌కుమార్, శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జడ్‌పి సిపి అరుణ, ఎంసిపి జిందం కళచక్రపాణి, కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్‌పి అఖిల్ మహజన్ తదితరులతో కలిసి సిరిసిల్ల ఆసుపత్రిలో పరామర్శించా రు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే హైదరాబాద్ పంపి వైద్యం అందిస్తామన్నారు. బాధితుల పరిస్థితిని మంత్రి కెటిఆర్ ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News