Sunday, December 22, 2024

వ్రితి అగర్వాల్‌కు మరో రెండు స్వర్ణాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ జూనియర్ బాలికల స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ సంచలనం వ్రితి అగర్వాల్ మరో రెండు స్వర్ణాలను గెలుచుకుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వేదికగా ఈ పోటీలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన బాలికల 400 మీటర్ల ఫ్రిస్టయిల్ విభాగంలో వ్రితి ప్రథమ స్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో వ్రితి 4:27:94 సెకన్లలో గమ్యాన్ని చేరి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. కర్నాటక స్విమ్మర్ హషికకు రజతం,

షిరీస్ (కర్నాటక)కు కాంస్య పతకాలు లభించాయి. అంతేగాక బాలికల 200 మీటర్ల బట్టర్‌ప్లయ్ గ్రూప్2 విభాగంలో కూడా వ్రితి అగర్వాల్ స్వర్ణం సొంతం చేసుకుంది. 2:23:55 నిమిషాల్లోనే లక్ష్యాన్ని చేరి ప్రథమ స్థానం సొంతం చేసుకుంది. హషిక (కర్నాటక) రజతం, ధ్రితి యోగేస్ (మహారాష్ట్ర) కాంస్య పతకాలు సాధించారు. ఇదిలావుంటే తెలంగాణ యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే నాలుగు స్వర్ణాలు గెలుచుకుని పెను ప్రకంపనలు సృష్టించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News