Thursday, December 12, 2024

‘తల్లికి నీరాజనం, తరలింది ప్రభంజనం’

- Advertisement -
- Advertisement -

విగ్రహావిష్కరణ ఆహ్వానం వీడియోను పోస్ట్ చేసిన సిఎం రేవంత్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్:  నేడు ఆవిష్కరించే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలంతా తరలిరావాలని ఎక్స్ వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి కోరారు. తల్లికి నీరాజనం, తరలింది ప్రభంజనం అంటూ విగ్రహావిష్కరణ ఆహ్వానం వీడియోను రేవంత్ రెడ్డి పోస్టు చేశారు. జయజయహే తెలంగాణ అంటూ అందెశ్రీ సాహిత్యాన్ని అందలమెక్కించిన సిఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఈ గీతాన్ని, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయలను ప్రతిబింబించేలా, ముక్కోటి గొంతుకలు మురిసిపోయేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా వీడియోలో పేర్కొన్నారు.

వీడియోలో తెలంగాణ నదులు, పుణ్యస్నానాలు, గ్రామీణ జీవనం, బతుకమ్మ ఉత్సవాలు, డప్పు వాయిద్యం, కోలాటాలు, శివసత్తు పూనకాలు, గిరిజన, గొండు సంప్రదాయ నృత్యాలు, కాక తీయ దేవాలయాలు, వాటి ప్రాంగణంలో శాస్త్రీయ నృత్యాలు, సమ్మక్క సారలమ్మ గద్దెలు, సచివాలయం, తెలంగాణ తల్లి విగ్రహం తదితర దృశ్యాలతో సాగుతూ ఈ వీడియో ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News