Wednesday, January 22, 2025

డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ వేడుకలు సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అదే రోజున తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది నిర్వహించే ఉత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని పిలవాలనుకుంటున్నామని అభిప్రాయం వ్యక్తం చేశారు. త్వరలోనే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

తెలంగాణ తల్లి విగ్రహ విశేషాలు
తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలకు చెందిన ప్రత్యేకతలను తెలంగాణ తల్లి రూపకల్పనలో జోడించారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా బతుకమ్మ, గద్వాల, పోచంపల్లి చీర, కరీంనగర్ వెండి మెట్టెలు, కోహినూర్ వజ్రం, జాకబ్ వజ్రం, పాలమూరు, మెదక్, అదిలాబాద్ మెట్ట పంటలకు చిహ్నంగా జొన్న కంకెలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల సంస్కృతికి చిహ్నంగా బంగారు నగలు, భరతమాత ముద్దు బిడ్డగా అందమైన కిరీటం, వడ్డాణం,

జరీ అంచుచీర నిండైన కేశ సంపద ఇలా ఎన్నో చారిత్రక, సాంస్కృతిక విశేషాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి మార్పు చేసేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా తుది రూపంపై చర్చలు జరుగుతున్నాయని అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా రాష్ట్ర ప్రతిష్ఠను ఇనుమడించేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా తమ కార్యాచరణ ఉంటుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News