Sunday, January 12, 2025

నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

- Advertisement -
- Advertisement -

ఎయిర్ షో అనంతరం సచివాలయంలో విగ్రహావిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లను సిఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం పరిశీలించింది. సచివాలయంలో పర్యటించిన సిఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు విగ్రహాన్ని సిఎం రేవత్ ఆవిష్కరించను న్నారు. అనంతరం డ్రోన్ షోతో పాటు బాణసంచా కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా చూడాలని, ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సిఎం సూచించారు. ఈ కార్యక్రమంలో సిఎంతో పాటు మంత్రులు, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News