Sunday, November 17, 2024

బెంగళూరు బిల్డర్లపై ‘తెలంగాణ’ పన్ను

- Advertisement -
- Advertisement -

చదరపు అడుగుకు రూ.500 విధిస్తున్న అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం

మనతెలంగాణ/హైదరాబాద్ :  కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రాజకీయ ఎన్నికల పన్ను విధిస్తోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆరోపించారు. బెంగళూరు బిల్డర్లకు చదరపు అడుగుకు రూ.500ల చొప్పున పన్ను విధిస్తూ.. కర్ణాటక ప్రభుత్వం నిధుల సేకరణ చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్‌పై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కెటిఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాత అలవాట్లు ఎక్కడికి పోతాయ్..? ఘనత వహించిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ చేసిన కుంభకోణాలు అన్నీ ఇన్ని కాదని విమర్శించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్…స్కాంల వారసత్వంతో స్కాంగ్రెస్‌గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. కర్ణాటక నిధులను తీసుకొచ్చి తెలంగాణలో ఎంత వెదజల్లినా తెలంగాణ ప్రజలను మోసం చేయలేరని, నిధులు తెచ్చి తెలంగాణలో వెదజల్లినా అధికారంలోకి రాదు అని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్కాంగ్రెస్‌ను తిరస్కరిస్తారని మంత్రి కెటిఆర్ అన్నారు. కాం గ్రెస్ పార్టీపై అవకాశం దొరికినప్పుడల్లా.. మంత్రి కెటిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ఉద్దేశంతో.. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రక టించిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎవరో తెలియని పార్టీ.. ఆరు గ్యారెంటీలను ఎలా ప్రకటించిందో అంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రకటించిన పథకాలను అమలు చేయలేని దుస్థితిలో హస్తం పార్టీ ఉందని విమర్శించారు.

అలాంటిది తెలంగాణలో ఎవరి డబ్బు తీసుకువచ్చి.. గ్యారెంటీ పథకాలను అమలు చేస్తారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అవకాశం ఇస్తే మళ్లీ.. కటిక చీకట్లు, తాగునీటి ఇక్కట్లు తప్పవని కెటిఆర్ పేర్కొన్నారు. కటిక చీకట్లు, ఎరువులు, విత్తనాల కోసం కష్టాలు, తాగునీటి ఇక్కట్లు అంటూ ఇవి ఆ పార్టీ గ్యారెంటీలు అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే.. ఇప్పుడు సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న రైతుబంధుకు రాం రాం.. చెబుతారని, దళితబంధుతో పాటు ఇతర పథకాలు ఆగిపోవడం గ్యారెంటీ అంటూ భగ్గుమన్నారు. ఎంతసేపు ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడే హస్తం పార్టీ.. ఎప్పుడైనా అభివృద్ధి విషయంపై మాట్లాడిందా అంటూ ఘాటుగానే ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News