Monday, December 23, 2024

కలిసిరాని ‘బిసి బాస్’లు..

- Advertisement -
- Advertisement -

కలిసిరాని ‘బిసి బాస్’లు
అధ్యక్షుడి ఎంపికపై టి టిడిపిలో సర్వత్రా చర్చ
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ప్రస్తు తం బాస్ ఎవరు? ఇన్నాళ్లు పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. అంతకు ముందు పని చేసిన ఎల్. రమణ లాంటి వారు పార్టీని వీడి వారు అధికార బిఆర్‌ఎస్‌లో చేరడంతో బిసిలకు ఈ సారి ఛాన్స్ దక్కుతుందా? అన్న చర్చ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది. ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన షాద్‌నగర్ మాజీ ఎంఎల్‌ఏ బక్కని నర్సింహులు లాంటి సీనియర్ నాయకులకు మరోసారి అకాశం ఇచ్చి ఉంటే వారు పార్టీలు మారే వారే కాదని చెబుతున్నారు. అలాంటి వారు అధినేత చంద్రబాబు అడుగుజాడల్లోనే నడుచుకుంటూ పార్టీకి, పార్టీ విధానాలకు కట్టుబడి ఉండేవారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చినా టిడిపి పోటీ చేయక పోవడానికి వలస వెళ్లిన నాయకులే కారణమని టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు. అంతా అధికార పార్టీలో చేరుతున్నారేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎల్. రమణను తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా నియమించారు. సుమారు ఆరేళ్లు కొనసాగిన ఆయన అంతలోనే బిఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరి పోయారు. ఎన్‌టిఆర్ సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిందని, రాష్ట్రం విడిపోయాక ఏపిలోనూ 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేశామని టిడిపి నేతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News