Monday, December 23, 2024

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

- Advertisement -
- Advertisement -
telangana temperatures rising
ఏసీలు,కూలర్లకు పెరుగుతున్న డిమాండ్
చిన్నపాటి జాగ్రత్తలో విద్యుత్ ఆదా చేసుకోచ్చు అంటున్న నిపుణులు

హైదరాబాద్: రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు పెరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ సంవత్సరం వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు కూడా హెచ్చరించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదారాబాద్‌లో ఏసీలు, కూలర్ల విద్యుత్ వినియోగం అధికం అవుతోంది. సాధారణ, దిగువ తరగతి ప్రజలు, కూలర్లపై దృష్టి సారించగా, మధ్య ఎగువ తరగతి ప్రజలు ఏసీలపై దృష్టి సారిస్తున్నారు. దీంతో బజాజ్, రిలియన్స్, సోనీ విజన్,తదితర ఎలక్ట్రికల్ షోరూంలు కోనుగోలు దారులతో కిటకిటలాడుతున్నాయి. పెరుగుతున్న ఎండల దృష్టా ధర ఎంతఉన్నా కొనక తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. లోకల్‌గా తయారైన కూలర్లకు చిరునామాఅయిన ఆబిడ్స్, కోఠీ, అఫ్జల్‌గంజ్, అమీర్‌పేట, తదితర ప్రాంతాల్లో వినియోగదారులు పెద్ద ఎత్తున వీటిని కోనుగోలు చేస్తున్నారు.

గతంలో మార్కెట్లో రూ.3 నుంచి 8 వేలలో లభించే కూలర్లు ఇప్పడు రూ.10 నుంచి 15 వేలు పలుకుతున్నాయి. ఏసీలు, కూలర్ల ధరలు పెరుగుతుండటంతో గతంలోనే ఏసీలు, కూలర్లు ఉన్నవారు వాటిని మరమ్మత్తులు చేసుకుని వినియోగించుకుంటుండగా మరి కొంత మంది కొత్తవాటిని కొనుగోలు చేసేందుకు సిద్దపడుతున్నారు. దీంతో ఇటు కూలర్లు, ఏసీ మెకానిక్‌లకు చేతినిండా పనిదొరుకుతోంది. పాత ఏసీలు, కూలర్ల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొంత మంది వినియోగదారులు ఏసీలను,కూలర్లను కేవలం వేసవి కాలంలోనే వినియోగిస్తుంటారని అది సరికాదని సూచిస్తున్నారు. ఏసీలను, కూలర్లును కనీసం రెండు మూడు నెలలకు ఒకసారైనా 15 నుంచి 30 నిమిషాల పాటు ఆన్ చేసి ఉంచాలన్నారు. ఏసీలను ప్రతి సంవత్సరం ఒకసారైన సర్వీసు చేయించాలని లేక పోతే వాటిలో ఉండే విద్యుత్ కండెన్సర్లు పనిచేయక పొవడం లేదా కంప్రెషర్‌లో గ్యాస్ తగ్గడంతో కూలింగ్ తగ్గడమే కాకుండా విద్యుత్ బిల్లులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏసీ రూమ్‌లలో సాధ్యమైతనంత వరకు ఉడ్‌కు సంబంధించిన వస్తువులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక వేళ ఇనుప బీరువాలు, ర్యాక్‌లు ఉంటే ఏసీల ద్వారా వచ్చే కూలింగ్‌ను అవి ఎక్కువగా తీసుకుంటాయని చెబుతున్నారు. ఒక వేళ ఉన్నా వాటి మీద దుస్తులను కప్పిఉంచాలని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. దీంతో ఏసీలు,కూలర్ల వినియోగం అధికమైన విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉంది

ఈ జాగ్రత్తలు తప్పని సరి…

ఏసీలో వాడకంలో వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని బీఈఈ ( పేర్కొంది) బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పేర్కొంది. వాటిలో ముఖ్యంగా సాధారణంగా
*మన ఇళ్ళల్లో ఉండే ఒకటిన్నర టన్నుల సామర్థం కలిగిన ఏసీలను రాత్రి సమయంలోనే వినియోగించాలని దాంతో విద్యుత్ బిల్లు రూ.1500 వస్తుంటాయని చెబుతోంది.రెండు ఏసీలు ఉంటే రూ.2500 నుంచి 3 వేల వరకు బిల్లు వస్తుంది. సాధారణ రోజుల్లో వీటి బిల్లులు రూ.500 లోపే ఉంటాయి.
* ఏసీలో ఉష్ణోగ్రత 1 డిగ్రీపెంచితే 6 శాతం విద్యుత్ బల్లును ఆదా చేసుకోవచ్చు. చల్లదనం ఎక్కవగా ఉండేందుకు ఉంచేందుకు కొంత మంది 18 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత పెడుతుంటారని, దీంతో విద్యుత్ బిల్లు అధికంగా వస్తుంది.
* ఏసీని ఎల్లప్పుడు 24 డిగ్రీల వద్ద ఉండే విధంగా చూసుకుసంటే కంప్రెషర్ తక్కువ సమయం నడుస్తుందని దాంతో విద్యుత్ బిల్లు 24 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది.
* అనేక రోజుల అనంతరం ఏసీలు వినియోగించాల్సి వస్తే ముందుగా సర్వీసింగ్ చేయించుకోవాలి.
* ఫిల్టర్లను శుభ్రంగా ఉంచుకుంటే అధికమొత్తంలో గాలి రావడమే కాకుండా ,కంప్రెషర్‌పై భారం కూడా తగ్గుతుంది.
* ఇళ్ళల్లోని డైరక్టుగా ఎండ తగలకుండా కర్టెన్లు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా బాల్కనీల్లో మొక్కలను పెంచడంతో ఏసీలపై భారం తగ్గడంతో విద్యుత్ బిల్లులను కూడా ఆదా చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News