Friday, January 17, 2025

తెలంగాణ తల్లి ముంగిట నీటి పుష్పాలు

- Advertisement -
- Advertisement -

జయ జయహే తెలంగాణ మ్యూజిక్
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కొలువుదీరిన తెలుగుతల్లి విగ్రహం పరిసరాలను మరింత కళాత్మకంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తున్నది. తెలంగాణ అధికారిక పాట జయ జయహే తెలంగాణ& పాట మ్యూజిక్‌తో పరిసరాలు ప్రతిధ్వనించేలా ఏర్పాట్లు చేయనున్నది. డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ తదుపరి శరవేగంగా బ్యూటిఫికేషన్ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసింది.

గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి దాసరి హరిచందన తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులనుపరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను కార్యదర్శి హరిచందన వివరించారు. దాంతో ఇప్పటి వరకు జరిగిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయి. కానీ, ఇంకా లైటింగ్ ఆకర్షణీయంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని వేం నరేందర్ రెడ్డి సూచించారు.

మ్యూజికల్ వాటర్ ఫౌంటేన్ తరహాలో చక్కటి అందాలను, జలపుష్పాలను అందనంగా పొందుపరచాలని అధికారులకు తెలిపారు. ఇక్కడ జరుగుతున్న పనులను ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారని, ఆలోగా తెలంగాణ తల్లి విగ్రహం వద్ద వాటర్ ఫౌంటేన్, లైటింగ్స్ పనులు పూర్తిచేయాలన్నారు. వారి వెంట జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News