Friday, February 14, 2025

తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ భారీగా తరలిరావాలి: మహేష్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్: సచివాలయంలో సోమవారం సాయంత్రం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగే సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్‌లతో ఈ జూమ్ సమావేశం నిర్వహించారు.

ఈ ఏడాదిలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఏడాది పాలనపై ప్రభుత్వం చేసిన సభలకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. నేడు జరిగే ముగింపు ఉత్సవాలలో భాగంగా సచివాలయం వద్ద సాయంత్రం 4 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని, ఆ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News