Monday, January 20, 2025

ఉత్తమ వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానం: మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైద్య ఆరోగ్య శాఖ నివేదికను ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తమ వైద్య సేవల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. ఏడాదిలో 8 వైద్య కళశాలలను అందుబాటులోకి తెచ్చామని, మరో 9 కొత్త వైద్య కళశాలలను అందుబాటులోకి తెస్తామన్నారు.

హైదరాబాద్ నలుమూలల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మింస్తామన్నారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాం అని ఆయన తెలిపారు. కొత్తగా 61 డయాలసిస్ కేంద్రాలు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో టీ డయాగ్నో స్టిక్ హబ్స్ ఉన్నాయని ,త్వరలో మరో 13 జిల్లాల్లోనూ అందుబాటులోకి తెస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News