Tuesday, January 21, 2025

తలోదారి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ.. నిరంకుశత్వా న్ని తెంచుకుని ప్రజాస్వామ్యంలో కలిసిన రోజు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ సంస్థానం.. భారతదేశంలో కలిసిన రోజు. అయితే ఈ సెప్టెంబర్ 17వ తేదీ అ నేది ప్రతీ సంవత్సరం తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారి తీస్తూనే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సెప్టెంబర్ 17ను ఒక్కో పార్టీ ఒక్కో విధంగా జరుపుకుంటూ వస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈరోజున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. గతంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ.. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించగా, ఈసారి అధికార కాంగ్రెస్ పార్టీ.. ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించాలని నిర్ణయించింది.మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

ఇక రాష్ట్రంలోని మిగితా 32 జిల్లాల్లో కూడా మంత్రులు జెండాలు ఎగురవేసి.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని జరపనున్నారు. బిజెపి సెప్టెంబర్ 17నుతెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడానికి సిద్ధమైంది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో మరో కేంద్ర మంత్రి హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, బిఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మంగళవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంఎల్‌ఎ కె.టి.రామారావు జాతీయ జెండానుమ ఆవిష్కరించనున్నారు. కాగా, సెప్టెంబర్ 17వ తేదీనే నగరంలో మహానిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగర వ్యాప్తంగా ఉన్న బడా గణేషులు మంగళవారం రోజునే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. సెప్టెంబర్ 17 అత్యంత కీలకమైన రోజుగా మారిన నేపథ్యంలో నగర పోలీసు శాఖ అత్యంత అప్రమత్తమైంది. రాజకీయ పార్టీల కార్యక్రమాలతో పాటు నిమజ్జనం నేపథ్యంలో పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్ట చర్యలు తీసుకుంది.

సిపిఐ విలీన దినోత్సవ వేడుకలు
సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో మంగళవారం ఉదయం 10.00 గంటలకు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరి స్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు. పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు హాజరై విజయవంతం చేయాల్సిం దిగా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News