Friday, February 21, 2025

హైదరాబాద్‌లో మిస్‌వరల్డ్ పోటీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ప్రారంభం, ముగింపు వేడుకలు
భాగ్యనగరంలోనే గ్రాండ్ ఫినాలే 120 దేశాలకు
చెందిన యువతులు పాల్గొననున్నారు.. మే 7
నుంచి 31 వరకు పోటీలు

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూసే మిస్‌వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనుంది. తెలంగాణ చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఇదొక గొప్ప వేదిక.

మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మక 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనుంది. మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని మిస్ వరల్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. దాదాపు నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలేకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్ ఫెస్టివల్లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయి. ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఈ పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. మే 7 నుంచి ఈ అందాల పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుం ది. గతంలో న్యూఢిల్లీ, ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News