Thursday, December 19, 2024

రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త ఈవి పాలసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ పాలసీ అమలు కానున్నది. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో కొత్త పాలసీ వివరాలు ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై కొనుగోలు చేసే అన్ని ఈవి వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. జివో 41 ద్వారా తెచ్చే ఈ కొత్త పాలసీ 31 డిసెంబర్ 2026 వరకు అమలులో ఉంటుందన్నారు.

ఎలక్ట్రిక్ టూ వీలర్స్, ఆటో, ట్రాన్స్ పోర్ట్ బస్సులకు వంద శాతం రిజిస్ట్రేషన్ మినహాయింపు ఉంటుందని, దీని ద్వారా వినియోగదారులకు ఏడాదికి  లక్ష రూపాయల వరకు ఆదా అవుతుందని వివరించారు. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ కూడా కాలుష్యం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ కొత్త  ఈవి పాలసీని ప్రవేశపెడుతున్నామన్నారు. నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను మూడు వేల బస్సుల స్థానంలో తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మున్ముందు నగరంలో మొత్తం ఈవి ఆర్టీసి బస్సులు నడుస్తాయని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News