Monday, December 23, 2024

దివ్యాంగులకు భరోసా..ఆసరా పెన్షన్: మంత్రి అల్లోల

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : దివ్యాంగుల అభ్యున్నతికి , సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నా ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. దివ్యాంగులకు ఫెన్షన్‌లు రూ. 4,116 పెంచినందుకు సిఎం కెసిఆర్ చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దివ్యాంగులు క్షీరాభిషేకం చేశారు. ఫెన్షన్ పెంపు పై నిర్మల్ జిల్లాలోని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. ఫెన్షన్ రూ. 4.116 కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వృద్దులకు కేవలం రూ. 200, దివ్యాంగులకు రూ.50 మాత్రమే ఇచ్చే వారని , సీఎం కేసీఆర్ నేతృత్వంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనకు మంచి రోజులొచ్చన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఆధుకుంటుందన్నారు. దేశంలోనే దివ్యాంగులకు అత్యధిక ఫెన్షన్‌ను అందిస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలించిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు,అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News