Thursday, January 23, 2025

నేడు అసెంబ్లీకి కులగణన బిల్లు

- Advertisement -
- Advertisement -

ఆమోదించనున్న సభ? నెరవేరబోతున్న బిసిల కల

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో కులగణన చేపట్టాలన్న బిసిల చిరకాల డిమాండ్ నెరవేరబోతోంది. రాష్ట్రంలో కులగణనకు ప్రభు త్వం సమాయత్తమయ్యింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో నేడు బిల్లును ప్రవేశ పె ట్టను న్నది. బిల్లుకు నేడు ఆమోదం లభించవ చ్చునని అనుకుంటున్నారు. ఇందుకు సంబం ధించిన సన్నాహాలను అధికారులు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాం గ్రెస్ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుడు తు న్నది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఇందుకు ఆ మోద ముద్ర వేసింది. దేశ వ్యాప్తంగా కులగణన జరుపాలని,కులాల వారీగా జనాభా లెక్క లు తీయాలని బిసి సంఘాలు సుదీర్ఘ కాలం గా పో రాటాలు చేస్తున్నాయి.

అయితే, కేంద్రం కులగణనకు సిద్ధంగా లేకపోవడంతో ఇప్పటికే బీహార్ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కులగణను చేపట్టాయి. ఆ జాబితాలో ఇప్పుడు తెలంగాణ కూడా చేరబోతోంది. బిసిల కులగణన చేపట్టినట్లైతే జనా భా దామాషా ప్రకారం వారి వాటా వారికి దక్కనుంది. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బిసిలకు చట్టసభల్లో రిజర్వేసన్లు లేకపోవడం తెలిసిందే. స్థానిక సంస్థల్లోనూ రిజర్వేషన్లు పరిమి తం కావడంతో బిసిల జనా భా కులాల వారీగా లెక్కలు తీస్తే వారి జనాభా కనుగుణంగా అన్ని రంగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించేందుకు మా ర్గం సుగమమవుతుందని బిసి అంటున్నారు. ఇందుకు న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తున్నారు. కులగణన వల్ల చట్టసభల్లో 50 శాతాని కి పైగా బిసిల ప్రాతినిధ్యం పెరుగుతుందని భా విస్తున్నారు.

ఉద్యోగాల్లోనే గాకుండా రాజకీయాల్లోనూ బిసిలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లుదక్కాలనేది బిసి సంఘాల డిమాండ్.
56 శాతం బిసి జనాభా ఉందని బిసి సంఘాలు పేర్కొంటున్నాయి. కుల గణన వల్ల స్థానిక సంస్థలతోపాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు జనాభా దమాషా ప్రకారం దక్కుతాయని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News