Sunday, January 19, 2025

సర్కార్ దవాఖానాల్లో ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణానికి అనుమ‌తులు

- Advertisement -
- Advertisement -

Telangana to set up STPs in 20 Government hospitals

గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, టిమ్స్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్ర‌ధాన ఆసుపత్రుల్లో ఏర్పాటు

రూ.134.46 కోట్లు కేటాయించిన ప్ర‌భుత్వం

హైదరాబాద్: తొలిసారిగా రాష్ట్ర‌వ్యాప్తంగా 20 ప్ర‌ధాన ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో మురుగుజ‌ల శుద్ధి ప్లాంట్ల‌ను (ఎస్టీపీ) ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తులు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు పర్యావరణ, ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఆసుపత్రుల నుంచి వెలువ‌డే వ్యర్ధజలాలను శుద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం ఈ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తోంది. ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ చొర‌వ‌తో తొలివిడుత‌గా ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో ఎస్టీపీలు నిర్మించ‌నున్నారు. ఇందుకు ప్ర‌భుత్వం రూ.134.46 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్న‌ది. ఇందులో పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వాటా రూ.52.59 కోట్లు. ఈ ఎస్టీపీల‌ను ప్ర‌భుత్వం అత్యాధునిక హైబ్రిడ్ యాన్యువిటీ మోడ‌ల్ (హెచ్ఏఎం)లో నిర్మిస్తున్న‌ది. మ‌రో నెల రోజుల్లో టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి చేయ‌నున్నారు. అనంత‌రం నిర్మాణ ప‌నులు ప్రారంభిస్తారు. నిర్మాణ సంస్థ‌లే ప‌దేండ్ల పాటు ప్లాంట్ల‌ను నిర్వ‌హించ‌నున్నాయి.

హైద‌రాబాద్ లోని గాంధీ, ఉస్మానియా, టిమ్స్, నీలోఫర్ ఆసుపత్రులతో పాటు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సూర్యపేట, నల్గొండ, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, జగిత్యాల, రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, సిద్దిపేట మెడికల్ కాలేజి, ఖమ్మం, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మురుగు నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఆస్పత్రుల నుంచి వివిధ రూపాల్లో విడుదలయ్యే వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా బయటకు విడుదల చేయడం వల్ల పర్యావ్యవరణ కాలుష్యం జరుగుతుంది. ఆపరేషన్ థియేటర్, ల్యాబ్స్, పేషంట్ల బెడ్ షీట్స్ ఉతికే సమయంలో, వార్డులను శుభపరిచే సమయంలో వచ్చే వ్యర్ధ జలాలను ముందుగా డిసిన్ఫెక్టు చేసి ఎస్టీపీలకు పంపుతారు. అక్కడ నీటిని శుద్ధి చేసి, పునర్వినియోగించుకునే విధంగా లేదా బయటికి వదులుతారు. ఇలా చేయడం వల్ల నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News