Thursday, December 26, 2024

తలసరి ఆదాయంలోమనమే నెం.1

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోవాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా దేశంలో ఒక్క తెలంగా ణ రాష్ట్రంలోనే సాధ్యమవుతుందని మరోసారి స్పష్టమైంది. విద్యార్హతలున్నా, లేకపోయినా కూడా కా ర్మికులుగా జీవనం సాగించే వారు కూ డా సగటున తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కి రూ.3,08,732 సంపాదిస్తున్నారని, ఇక వ్య వసాయం చేసే రైతుల దగ్గర్నుంచి వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, ఐటి పరిశ్రమల్లో పనిచేసే టెక్కీలు, ఫార్మా రం గంలో పనిచేసే నిపుణులకైతే లక్షల్లోనే జీతాలు చెల్లిస్తున్న సంస్థలు, కంపెనీలు ఒక్క తెలంగాణ రా ష్ట్రంలోనే అధికంగా ఉండడంతోనే తలసరి ఆ దాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా అగ్రస్థానంలో నిలిచిందని సాక్షా త్తూ కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, ప్రోగ్రామ్స్ అమలు మంత్రిత్వశాఖ నివేదికలు స్పష్టంచేశా యి. ఆ మంత్రిత్వశాఖాధికారులు తాజాగా వి డుదల చేసిన నివేదికలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని నివేదించింది.

రెండో స్థానంలో ఉన్న కర్ణాటక రా ష్ట్రంలోని ప్రజల తలసరి ఆదా యం 3,01,673 రూపాయలుగా ఉందని, మూడో స్థా నంలో నిలిచిన హర్యానా రా ష్ట్రంలోని ప్రజల తలసరి ఆ దాయం రూ.2,96,685గా ఉం దని ఆ నివేదిక స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర తలసరి ఆదాయం రూ.2,19,518, అస్సాం రూ. 1,18, 504, చత్తీస్‌గఢ్ రూ.1,33,898, ఇక ప్రధాన మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2,50, 100 మాత్రమే. మధ్యప్రదేశ్ రూ. 2,42,247, మేఘాలయ రూ. 98,572, ఒడిశా రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,50, 676, పంజాబ్ రాష్ట్రం రూ.1,73,873, రాజస్థాన్ రాష్ట్రం రూ.1,56,149, తమిళనాడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,73,288, ఉత్తరాఖండ్ రూ.2,33, 565, జమ్మూకశ్మీర్ ప్రజల త లసరి ఆదాయం రూ.1,32, 806గా ఉంది.

అం తేగాక దేశంలో ఉన్న ఎన్నో పెద్ద రాష్ట్రాల కంటే కూడా తెలంగాణ రాష్ట్రంలోనే తలసరి ఆదా యం భారీగా పెరిగిందని, ఏకంగా రూ. 2, 65,942 నుంచి ఏడాది కాలంలోనే రికార్డుస్థాయిలో రూ.3,08,732కు తెలంగాణ రా ష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాల మంత్రిత్వశాఖ ఆ నివేదికలో స్పష్టంచేసింది. అంతేగాక తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కలిపిన తలసరి ఆదాయం లో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రజల ఆదాయం కూడా భారీగా పెరిగిందని ఆ నివేదిక స్పష్టంచేసింది. అందులో భాగంగానే జిల్లాల వారీగా ప్రజల సంపాదనలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్-మల్కాజిగిరి జి ల్లాల తలసరి ఆదాయం గణనీయంగా ఉందని తెలిపింది. రా ష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ప్రజల తలసరి ఆ దాయం 1,98,997 రూపాయలుగా ఉండగా రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ జిల్లా ప్రజల తలసరి ఆదాయం 1,62,564 రూపాయలుగా ఉంది.

మూడో స్థానంలో ఉన్న మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా ప్రజల తలసరి ఆదాయం 62,506 రూపాయలుగా ఉంది. ఇక మిగతా జిల్లాల ప్రజల తలసరి ఆదాయం కూడా ఇంచుమించుగా మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లా ప్రజల తలసరి ఆదాయం స్థాయిల్లోనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సే వా రంగాలు, ఆర్ధికరంగాలు, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసులు (ఐటి, ఫార్మారంగాలు) ఎక్కువగా తలసరి ఆదాయాలను పెంచాయని ఆ నివేదిక స్పష్టంచేసింది. అంతేగాక వ్య వసాయం, అటవీ సంపద, చేపల రంగాల నుంచి 18.97 శాతం ఆదాయం వస్తోందని ఆ నివేదిక తెలిపింది. ఇక మూడో అతిపెద్ద ఆదాయ వనరులుగా ఉన్న వాణిజ్యం, వర్తకం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్ సెక్టార్‌ల నుంచి మరో 17.98 శాతం ఆదాయం వస్తోందని ఆ నివేదిక స్పష్టంచేసింది.

అయితే కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఈ రంగాల నుంచి తలసరి ఆదాయం 15.78 శాతం మాత్రమే ఉండేదని,అది కాస్తా పుంజుకొని ఈ రంగాల్లో ఆదాయాలు గణనీయంగా పెరిగాయని, దాంతో 17.98 శాతానికి పెరిగాయని ఆ నివేదిక స్ప ష్టంచేసింది. వాస్తవానికి రాష్ట్రం సిద్దించిన 2014లో తలసరి ఆదాయం 1,12,,162 రూపాయలు ఉండగా నేడు 3,08, 732 రూపాయలకు పెరగడం సంతోషదాయకమని కొందరు సీనియర్ అధికారులు సగర్వంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో భారీగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, రోడ్లు, విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, భవనాలు తదితర భారీ నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు పెద్ద సంఖ్యలో నిర్మిస్తుండటం, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వృత్తులకు చేతినిండా పని కల్పించడం, ఉపాధి హామీ పనులు, గ్రామీణ రోడ్లు,

చేపల చెరువులు, మండు వేసవిలో కూడా మిషన్ కాకతీయ పథకం లో సుమారు 54 వేల చెరువుల్లో పుష్కలంగా నీరుండటం, జలాశయాల్లో నీరుండటం, పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటం వంటి పథకాలతో ప్రజలకు అన్నిరకాలుగా పనులు లభించడంతో అనూహ్యమైన ఎకనమిక్ యాక్టివిటీ (ఆర్ధిక కార్యకలాపాలు) పెరగడంతో తలసరి ఆదా యం రికార్డుస్థాయిలో పెరిగిందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని అంటున్నారు.అందుకే 2015 నుంచి 2021 వరకూ ఆర్ధిక వృద్ధిలో సగటున 11.7 శాతం పెరుగుదలతో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.

2021నాటికి భారతదేశ తలసరి ఆదాయం 1,28,820 రూపాయలు కాగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదా యం 2,37,632 రూపాయలకు పెరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదా యం ప్రస్తుతం 3,08,732 రూ పాయలకు పెరగగా బిజెపి పాలనలో దేశం తలసరి ఆదాయం కేవలం ఒక లక్షా 72 వేల రూపాయలకు పరిమితమయ్యిందని ఆ అధికారులు వివరించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వంన్సున్న ఆర్ధిక విధానాల మూలంగా ప్రజల ఆదాయం పెరగకపోగా ఇంకా తగ్గిందని ఆ అధికారులు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News