Sunday, December 22, 2024

బూస్టర్ డోసు వేసుకోవడంలోనూ తెలంగాణ నెంబర్ వన్: హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

బూస్టర్ డోసు వేసుకోవడంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలవడం పట్ల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఇందులో దాగి ఉందని పేర్కొన్నారు.

కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. చైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవడం అవసరమని అన్నారు. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని, త్వరలో అవసరమైనన్ని డోసులు పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నానని మంత్రి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News