Friday, November 15, 2024

రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ టాప్

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జనగర్జన సభలో కేంద్రమంత్రి అమిత్‌షా

మనతెలంగాణ/హైదరాబాద్/ఆదిలాబాద్ ప్రతినిధి : దేశంలో రైతుల ఆ త్మహత్యల్లో తెలంగాణ నెంబర్ స్థానంలో ఉందని, తెలంగాణలో కుటుం బ పాలన పోవాలంటే బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన అవసరం ఏంతైన ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లో బిజెపి జనగర్జన సభలో, హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో తెలంగాణలో బిజెపి ప్ర భుత్వం ఏర్పడుతుంది. డిసెంబరు 3న హైదరాబాద్‌లో బిజెపి జెండా ఎగరాలి. బిజెపి తెలంగాణలో అధికారికంలోకి రాగానే గ్రామగ్రామాన తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా  నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైంది. గిరిజన వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం చూపించలేదు.. అందుకే ఆలస్యమైంది. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి రాష్ట్రానికి నీటి ఇబ్బంది లేకుండా చేశాం. రాష్ట్ర ప్రభుత్వం. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని అమిత్ షా వెల్లడించారు. బిజెపి.. సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీ… బిఆర్‌ఎస్ కుటుంబ పార్టీ.. ఇలాంటి పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండవు. కెటిఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడం తప్ప కెసిఆర్‌కు ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పేదల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు.
అడ్డంకులను అధిగమించి రామమందిరం నిర్మాణం..
‘అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోడీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. ఆర్టికల్ 370 ఎత్తివేసి కశ్మీర్‌కు విముక్తి కల్పించామన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశానని కెసిఆర్ చెబుతుంటారు.. రైతులు ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో తెలంగాణను నెంబర్ వన్ చేశారని అమిత్ షా మండిపడ్డారు. బిఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు.. కానీ, ఆ కారు స్టీరింగ్ మాత్రం ఒవైసీ దగ్గర ఉంటుంది. ఎం ఐఎం దగ్గర స్టీరింగ్ ఉన్న బిఆర్‌ఎస్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. బహిరంగ సభలో బిజెపి అగ్రనేతలు తరుణ్‌చుగ్, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, సోయం బాబురావు, ఈటల రాజేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అమిత్‌షాకు నిరసన సెగ
ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన జన గర్జన సభకు విచ్చేసిన అమిత్‌షా కాన్వాయ్‌ను ఆదిలాబాద్ సిపిఐ సాధన కమిటీ సభ్యులు అడ్డుతగులుతూ అమిత్‌షా డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. సిసిఐ పునరుద్ధరణ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులకు సిపిఐ నాయకులు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు స్థానిక స్టేషన్లకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News