Monday, December 23, 2024

99.99%

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్ ఆడిటింగ్‌లో మనమే టాప్

పంచాయతీ నిధుల వ్యయంలో సంపూర్ణ పారదర్శకత

కేంద్రం ఆదేశాలను పట్టించుకోని బిజెపి
పాలిత రాష్ట్రాలు నరేంద్రమోడీ సొంత
రాష్ట్రంలోనూ అదే పరిస్థితి బిజెపియేతర
పాలిత రాష్ట్రాల్లోనే కొంత పురోగతి

మన తెలంగాణ/హైదరాబాద్ : మోడీ సర్కార్ జారీ చేసిన ఆదేశాలను సాక్షాత్తూ బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులే తుంగ లో తొక్కుతున్నారు. వాటిని ఏమాత్రం ప్రాధాన్యత గల అంశం గా తీసుకోవడం లేదు. కనీసం వాటిని అమలు చేయాలన్న చిత్తశుద్ధి కూడా కనిపించడం లేదు. ఫలితంగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలు గాలిలో దీపంలా మారాయి. స్థానిక సంస్థలకు మంజూ రు చేస్తున్న నిధుల్లో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ప్రతిపైసా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రతి గ్రామపంచాయతీలోనూ ఆన్‌లైన్ ఆడిట్ ప్రణాళికలను అమలు చేయాలని చాలా కాలం క్రితమే కేంద్రం అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే చాలా రాష్ట్రాల్లో ఆ విధానం ఇంకా మొదలు కాలేదని తెలుస్తోంది. చివరకు బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రం జారీ చేసిన ఆదేశాలను అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఫలితంగా అనేక రాష్ట్రాల్లో గ్రామపంచాయతీల్లో ఈ విధానం ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని తెలుస్తోంది.

దేశంలో 2,56,470 పంచాయతీలు ఉండగా వాటిల్లో కేవలం 25,430లో మాత్రమే ఆడిట్ విధానం మొదలైంది. అంటే మొత్తం 9.92శాతానికి మించలేదని తెలుస్తోంది. విధంగా చెప్పాలంటే బిజెపియేతర ప్రభుత్వాలే కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో ఉంది. సాక్షాత్తూ ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా ఆన్‌లైన్ ఆడిట్ విధానం అమలులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. ఆ రాష్ట్రంలో మొత్తం 14,288 గ్రామపంచాయతీలు ఉంటే కనీసం ఒక్కటంటే ఒక్క గ్రామపంచాయతీలో కూడా ఆన్‌లైన్ ఆడిట్ విధానం ప్రారంభం కాలేదు. అదే తెలంగాణ వంటి రాష్ట్రంలో 12,769 గ్రామపంచాయతీలకుగానూ 12,768 పంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ విధానాన్ని పూర్తి చేసింది.

అంటే మన రాష్ట్రంలో దాదాపుగా 99.99 శాతం ముగిసింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఆడిట్ విధానం కనీసం మొక్కుబడిగా అయినా మొదలైనప్పటికీ చాలా రాష్ట్రాల్లో మాత్రం అసలు ప్రారంభానికే నోచుకోలేదని తెలుస్తోంది. వాస్తవానికి గ్రామపంచాయతీల్లో ఆన్‌లైన్ ఆడిట్ విధానాన్ని అమలు చేయడం వల్ల మూడు స్థాయిల్లో ఆర్థిక తనిఖీ సులభతరం అవుతుంది.– ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీల ఆదాయాలు….వ్యయాలను ఆన్‌లైన్‌లో ఆడిట్ చేయాలనే కేంద్రం పదేపదే రాష్ట్రాలను ఆదేశించింది. ఆ ఆదేశాలను బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ప్రదానంగా పక్కనపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ మాత్రం కేంద్రం జారీ చేసిన ఆదేశాలను అనుసరించి ఆన్‌లైన్ ఆడిట్ అమలును శరవేగంగా పూర్తి చేసింది. దీని కారణంగానే పలుమార్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున ప్రశంసలు వెల్లువెత్తాయి.

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ ఆడిట్ పురోగతి వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రం మొత్తం పంచాయతీలు ఆడిట్ మొదలైన గ్రామాలు జరిగిన శాతం
ఆంధ్రప్రదేశ్ 13,371 0 0.00
అరుణాచల్ ప్రదేశ్ 2,108 0 0.00
అస్సాం 2,197 0 0.00
బిహార్ 8,151 58 0.71
ఛత్తీస్‌ఘర్ 11,568 0 0.00
గోవా 191 0 0.00
గుజరాత్ 14,288 0 0.00
హర్యానా 6,225 0 0.00
హిమాచల్‌ప్రదేశ్ 3,615 96 2.66
జమ్ము, కాశ్మీర్ 4,291 0 0.00
జార్ఖండ్ 4,351 0 0.00
కర్నాటక 5,963 358 6.00
కేరళ 941 0 0.00
లడక్ 193 0 0.00
మధ్యప్రదేశ్ 22,714 1,807 7.96
మహరాష్ట్ర 27,899 142 0.51
మణిపూర్ 161 0 0.00
మేఘాలయ 0 0 0.00
మిజోరాం 834 0 0.00
నాగాలాండ్ 0 0 0.00
ఒడిశా 6,798 0 0.00
పంజాబ్ 13,241 188 1.42
రాజస్థాన్ 11,304 2,794 24.72
సిక్కిం 185 0 0.00
తమిళనాడు12,525 1 0.01
తెలంగాణ 12,769 12,768 99.99
త్రిపుర 1,178 82 6.96
ఉత్తరాఖండ్ 7,791 0 0.00
ఉత్తర్‌ప్రదేశ్ 58,189 7,135 12.26
పశ్చిమబెంగాల్ ౩,339 1 0.03

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News