హైదరాబాద్: సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివారం హైటెక్స్‌లో తెలంగాణ స్టేట్ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో టీఎస్ఈసిఎ-2021 అవార్డుల కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరిత తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహారం కార్యక్రమం ప్రారంభించారన్నారు. గ్రీన్ పవర్ కోసం సోలార్ పాలసి ఏర్పటు చేశారని, సోలార్ ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ కోసం, విద్యుత్ పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గవర్నర్ సూచించారు. ఇంట్లో పిల్లలకు కూడా విద్యుత్ ఆదాపై అవగాహన కల్పించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేస్తోందని, ప్రధాన మంత్రి కూడా ఎల్ఈడి బల్బ్ లపై అనేక సార్లు ప్రస్తావించారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, టీఎస్ రెడ్కో చైర్మన్, విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Telangana top in Solar power: Governor Tamilisai