Monday, January 20, 2025

బియ్యం ఉత్పత్తిలో మనమే చాంపియన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో వ్యవసాయరంగానికి అనుకూల వాతావర ణం పెరిగింది. అధునాతన పరిశోధనల్లో చీడపీడలను తట్టుకుని అధికోత్పత్తునిచ్చే కొ త్తరకం వరి వంగడాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సాగునీ టి వనరుల లభ్యత కూడ పెరిగింది. దేశంలో స్వాతం త్య్రం అనంతరం బియ్యం ఉత్పత్తులు ఎనిమిది రెట్లు పెరిగాయి.ప్రపంచ దేశాలతో పోటీపడుతు ధాన్యం ఉత్పత్తుల్లో ఇండియా దూసుకుపోతోంది. మన రై తంగాం బియ్యం ఉత్పత్తిలో కూడా ప్రపంచం లో 18.98శాతం ఉత్పత్తితో ఇండియాను ప్రపంచ చాం పియన్‌గానిలిపింది.గత ఐదారేళ్లుగా అంతర్జాతీయం గా ఉత్పతి అవుతున్న బియ్యం , దేశీయంగా ఉత్పత్తి అవుతు న్న బియ్యం గణాంకాలే అందుకు అద్దం పడుతున్నాయి. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న బియ్యంలో 12.17శాతం బియ్యం ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.2018-19 నాటికి ప్రపంచ దేశాల్లో మొత్తం 7656.78లక్షల మెట్రిక్ ట న్నుల బియ్యం ఉత్పత్తికాగా, అందులో మనదేశం నుంచి 1164.78 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇది ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో 15.21శాతంగా ఉండేది. తెలంగా ణ రాష్ట్రంలో కూడా 66.7లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఇది దేశ బియ్యం ఉత్పత్తిలో 5.73శాతంగా ఉండేది.

ప్రపంచ దేశాల్లో బియ్యం ఉత్పత్తి ఒడిదుడుకులుగా సాగుతూ 2023–24నాటికి 7200.45లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. అదే మనదేశంలో ఈ ఆరేళ్లకాలంలో బియ్యం ఉత్పత్తిలో ఏటా పురోభివృద్దిలోనే సాగూతూ 1367 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం నీటిపారుదల రంగంలో మెరుగైన విధానాలు అనుససరించటం , కృష్ణా-గోదావరి నదలు పరీవాహకంగా పలు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి జలవనురులను మరింత అందుబాటులోకి తెచ్చుకోవటం , భూగర్భ జల మట్టాలను మెరుగుపరుచుకోవటం వంటి పనుల ద్వారా రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణతను భారీగా పెంచుకుంటూ వచ్చింది. 2018-19 నాటికి కేవలం 66.7లక్షల టన్నులు ఉన్న బియ్యం ఉత్పత్తి 2019-20లో 74లక్షల టన్నులు, 2020-21లో 102 లక్షల టన్నులు, 2021-22లో 129లక్షల టన్నులు, 2022-23లో 158లక్షల టన్నులు, 2023-24నాటికి 166.31లక్షల మెట్రిక్‌టన్నులకు పెంచుకుంది. ఈ ఆరేళ్లలో 5.73శాతం నుంచి ఏకంగా 12.17శాతానికి బియ్యం ఉత్పత్తిని వృద్ది చేసి దేశంలోనే రికార్డు సృస్టించింది. ప్రంపచ బియ్యం ఉత్పత్తిలో మనదేశపు వాటా ఆరేళ్లకిందట 15.21శాతం ఉండగా ఈ ఆరేళ్లకాలంలో 18.98శాతానికి పెంచుకోగలిగింది.

వినియోగంలో రెండవ స్థానంలో దేశం :
ప్రపంచ దేశాల్లో బియ్యం వినియోగించే దేశాల్లో చైనా ఏటా 155మిలియన్ టన్నులను ఉపయోగిస్తూ మొదటి స్ధానంలో ఉండగా, మనదేశం 114.5 మిలియన్ టనుల వినియోగంతో రెండవ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ 37.5 మిలియన్ టన్నులు, ఇండోనేషియా 35.6మిలియన్ టన్నులు ,వియత్నాం 21.9మిలియన్ టన్నులతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. అంతర్జాతీయంగా బియ్యం అత్యధికంగాదిగుమతి చేసుకునే దేశాల్లో ఫిలిప్పీన్స్ ఏటా 1.18 మిలియన్ డాలర్ల విలువ మేరకు 3.061 మిలియన్ మెట్రిక్ టన్నుల మేరకు దిగుమతితో మొదటి స్థానంలో వుంది. చైనా ,ఇరాక్ ,బెనిన్ ,మొజాంబిక్ దేశాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. 2022-23లో 191దేశాలు 420 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకున్నాయి.

ఎగుమతుల్లో అగ్రస్థానం మనదే:
అంతర్జాతీయ మార్కెట్‌కు బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో మనదేశం అగ్రస్థానంలో నిలిచింది. ఏటా 9400.16 మిలియన్ డాలర్ల విలువ మేరకు 17.866 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. తర్వాత స్థానాల్లో ధాయ్‌లాండ్ 6.786 , వియత్నాం 4.776, పాకిస్థాన్ 3.124, చైనా 2.071 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నాయి. 2018-19 నుంచి బియ్యం ఎగుమతుల గ్రాఫ్‌లో తెలంగాణ దూసుకుపోతూ వస్తోంది. ఆరేళ్ల కిందట 0.12 లక్షల మెట్రిక్‌టన్నులకు పరిమితం అయిన తెలంగాణ రాష్ట్రం 2023-24నాటికి 0.24 లక్షల టన్నులతో రెట్టింపు స్థాయికి చేరింది. గత ఏడాది రాష్ట్రం నుంచి 354.52 కోట్ల రూపాయల విలవ మేరకు బియ్యం ఎగుమతులు జరిగాయి. పోరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.14734 కోట్ల విలువ మేరకు 44.97 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగింది.

విదేశాలకు తెలంగాణ బాస్మతి బియ్యిం !
అంతర్జాతీయంగా పెరుగాంచిన బాస్మతి బియ్యం పట్ల తెలంగాణ పట్టుబిగిస్తోంది. రాష్ట్రం నుంచి అమెరికా , సింగపూర్ , ఆస్ట్రేలియా , కెనడా తదితర దేశాలకు రాష్టం నుంచి ఇప్పటికే స్వల్పమొత్తాల్లో బాస్మతి బియ్యం ఎగుమతులు జరుగున్నాయి. తెలంగాణ నుంచి సోనమసూరి, సాంబమసూరి, హెచ్‌ఎంటి ,1010 రకాల బియ్య ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. వీటిలో అత్యధికంగా ఫిలిప్పైన్స్ దేశానికి 11738 టన్నులు, అమెరికాకు 7979టన్నులు, బంగ్లాదేశ్ కు 2211టన్నులు, అరబ్ ఎమిరేట్స్‌కు 360టన్నులు, యు.కెకు 344టన్నులు కెనడాకు 325టన్నుల బియ్యం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎగుమతి జరుగుతోంది.

సమస్యల పరిష్కారానికే సదస్సు : మంత్రి తుమ్మల
బియ్యం ఎగుమతుల్లో ప్రధాన అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మన రాష్ట్ర బియ్యం ఎగుమతిదారులకు ఇతర రాష్ట్రాల వారితో పోలిస్తే అధిక రవాణ ఖర్చులు, హ్యాండ్లింగ్ చార్జీలు భరించాల్సివస్తోంది. రాష్ట్రంలో పండించిన బియ్యంలో ఉండే అధిక శాతం పురుగుమందుల అవశేషాలు, భూగర్భజలాల కాలుష్యంతో ఆర్సెనిక్ విలువలు పెరగటం వంటివి సమస్యగా ఉంది. అభివృద్ది చెందిన యూరఫ్ ,అమెరికా ,ఆస్ట్రేలియా వంటి దేశాలతోపాటు ఆఫ్రికా ఖండంలోని అనేక దేశాలు బియ్యం దిగుమతుల కోసం భారత్ వేపు చూస్తున్నాయి. ఈ అవకాశాలను మనం పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే రైతులకు సరైన ధరతోపాటు పెద్దమొత్తంలో ఉన్న మార్కెట్ నిల్వల సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చని మంత్రి తుమ్మల వివరించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ సమస్యలకు పరిష్కారం చూపేదిశగా దేశంలో తొలిసారి అందరిని ఒకే వేదికమీదకు చేర్చే ప్రపంచ వరిసదస్సును హైదరాబాద్‌లో నిర్వహింస్తోందని వెల్లడించారు.

అంతర్జాతీయ కమాడిటీస్ సంస్థ సహకారంతో ఈ నెల 7నుంచి ప్రారంభమయ్యే సదస్సు రెండు రోజుల పాటు జరగనుందని తెలిపారు. సదస్సు ద్వారా ఎగుమతి దిగుమతి దారులకు వేదిక కల్పించి వ్యాపార అవకాశాలు వృద్ది చేయటం ద్వారా తెలంగాణలో వరి పండించే రైతులందరికీ ఇది దోహదపడనుందన్నారు. శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొననున్నట్టు వెల్లడించారు. సదస్సకు 30దేశాల ప్రతినిధులతోపాటు ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ వరిపరిశోధనా సంస్థ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల కన్సార్టియం,తోపాటు భారత వరిపరిశోధన సంస్థ , యూపి, ఒరిస్సా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎగుమతిదారుల ఫెడరేషన్లు, శాస్త్రవేత్తలు , అధికారులు వరిసదస్సుకు హాజరు కానున్నట్టు మంత్రి తమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News