Wednesday, January 22, 2025

సంక్షేమంలో తెలంగాణ టాప్

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి, సుందరీకరణ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం దమ్మపేట మార్కెట్ యార్డ్ ప్రాంగణంల తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రం సంక్షేమం విషయంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నదని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా పయనిస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనతో కల్యాణ లక్షి, షాది ముబారక్, రైతు బంధు, ఉచిత కరెంటు, అసరా పెన్షన్,మహిళ శిశు సంక్షేమ శాఖ, కుల వృత్తులకు చేయూత, విద్యార్ధుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాలు సైతం అమలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. బిసిలు, కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, సిఎం రిలీఫ్ ఫండ్ కులవృత్తుల రుణాల చెక్కులును పంపిణి చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం, యాదవులు తమ సంప్రదాయ వృత్తిలో సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణి పథకంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నారవారిగుడెం గ్రామస్తులకు ఆరు యూనిట్ల రెండో విడత గొర్రెల పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా విచ్చేసిన అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కి అఖిల భారత యాదవ మహాసభ నాయకులు ఎమ్మెల్యేకు గొంగళి కప్పి, గొర్రె పిల్లను బహుమతిగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి పైడి వెంకటేశ్వరరావు, యాదవ సంఘం మండల అధ్యక్షులు జోనబోయిన శ్రీనివాసరావు, జిల్లా నాయకులు దొడ్డాకుల రాజేశ్వరరావు, తాళ్ళ వెంకటేశ్వరరావు, ప్రభు, రాసూరి శ్రీనివాసరావు, ఎర్ర గొర్ల నాగేశ్వరరావు, సాయిల శ్రీనివాసరావు, దమ్మపేట మండల యాదవులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News